సెమీస్‌లో కెర్బర్, సెరెనా

Updated By ManamTue, 07/10/2018 - 23:00
Kerber

Kerberవింబుల్డన్: జర్మన్ స్టార్, మాజీ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్, అవెురికా బ్లాక్ బ్యూటీ సెరెనా విలియమ్స్‌లు ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 11వ ర్యాంక్ కెర్బర్ 6-3,7-5 స్కోరుతో రష్యా ప్లేయర్ కాస్టనికాను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఇప్పటి వరకూ మూడు సార్లు వింబుల్డన్ గెలుచుకున్న కెర్బెర్  నాలుగో సారి టైటిల్ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఈ టోర్నీలో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకెళుతోంది.  కెర్బర్  షాట్లకు తొలి సెట్‌లో తట్టుకోలేకపోయిన కాస్టనికా 6-3 తేడాతో ఓడింది. అయితే రెండో సెట్‌లో అద్భుతమైన షాట్లతో కెర్బర్‌ను తిప్పలు పెట్టినా చివరికి వచ్చే సరికి చేతులెత్తేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో  లాత్వియా క్రీడాకారిణి ఒస్టాపెంకో 7-5, 6-4 స్కోరుతో సిబుల్‌కోవాను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఇంత వరకూ వింబుల్డన్‌లో మూడో రౌండ్ దాటలేక పోయిన నిరుటి ఫ్రెంచ్ ఓపెన్ విజేత వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరటం ఇదే ప్రథమం. మరోవైపు మాజీ చాంపియన్ అవెురికా క్రీడకారిణి సెరెనా విలియమ్స్ కూడా సెమీస్‌లో ప్రవేశించింది. టోర్నీ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనా మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 3-6, 6-3, 6-4 తేడాతో కమిలా జియోర్జి (ఇటలీ)పై విజయం సాధించింది. తొలి సెట్‌లో ఓటమి పాలైన సెరెనా ఆ తర్వాత పుంజుకొని తర్వాతి సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌లో దూసుకెళ్లింది.  మరో మ్యాచ్‌లో జర్మనీ స్టార్ 13వ సీడ్  జూలియా జార్జెస్ 3-6, 7-5, 6-1 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన కికి బెర్టెన్స్‌ను ఓడించి సెమీస్‌లో అడుగు పెట్టింది. 

మహిళల సెమీస్‌లో
ఒస్టాపెంకో X కెర్బర్
సెరెనా X జార్జెస్

Tags
English Title
Kerber, Serena in semis
Related News