కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలి

Updated By ManamSat, 09/22/2018 - 02:14
Uttam kumar reddy
  • రాథోడ్ చేరికతో కాంగెస్ మరింత బలం

  • కాంగెస్‌దే విజయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

uttamహైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని, నమ్మించి మోసం చేయడంలో కేసిఆర్‌కు మించిన నాయకుడు దేశంలో లేడని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన ఏఒక హామీ అమలు చేయకుండా కలబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు రమేష్ రాథోడ్ దంపతులతో పాటు అనుచరులు పెద్దఎత్తున పార్టీ రాష్ట బాధ్యులు రామచంద్రా కుంతియా,ప్రతిపక్షనేత జానారెడ్డి సమీక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి బలం పెరిగిందని, పదిస్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు నియంతత్వ పోకడలు పోతున్న కెసిఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్యేనని ఆయన తేల్చి చెప్పారు. దళిత గిరిజనులను అణిచి వేస్తున్నారని, మొదటి నుంచి ఆ వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసిఆర్ వారిని విస్మరించారని నిప్పులు చెరిగారు. రాష్టం నుంచి కేసిఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కా్రంగెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, పంట లకు గిట్టుబాట ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు ఈముగ్గురు కుమ్మకయ్యారని, నవంబర్‌లోగాని, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా కాంగెస్ గెలుపు ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషనర్, ప్రధాని మోడీ, సిఎం కేసిఆర్ కుమ్మకై హడావుడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నార న్నారు. ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని, ము గ్గురు ఒకటై  21లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. 

English Title
KCR's family should be turned away
Related News