కేసీఆర్ భోళా శంకరుడు

Updated By ManamWed, 06/13/2018 - 23:55
kavitha
  • అడక్కుండానే ఎవరికి ఏం కావాలో ఇస్తారు

  • గొల్ల కురుమలు.. మట్టిలో మాణిక్యాలు.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత  

kavithaహైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బోళా శంకరుడని, అడక్కుండానే ఎవరికి ఎం కావాలో ఇస్తారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బోధన్‌లో బుధవారం జరిగిన గొల్ల కురుమల బహిరంగ సభకు కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గొల్లకురుమలంతా మట్టిలో మాణిక్యాలని అన్నారు. ప్రభుత్వం గొల్ల కురుమలకు 60 లక్షల జీవాలను అందజేస్తే వీటికి 20 లక్షల జీవాలు తోడయ్యాయి అని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించిన తొలినాళ్లలో మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు వెళ్లామని, గొల్ల కురుమలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నించామని, ఏ బ్యాంకు ఇవ్వలేదని చెప్పారు.  గొల్ల కురువులకు ఏమైనా చేయాలని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ నిర్ణయించుకున్నారని, ఇప్పుడు వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని ఎంపీ కవిత వివరించారు. గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఏర్పాటు చేశారని, గొర్రె పిల్లల పంపిణీ వల్ల 5వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించినట్లు తెలిపారు. మటన్ మార్కెట్లను ఏర్పాటు చేసి, గొల్ల కురుమలు నేరుగా గొర్రెలు, మేకలను విక్రయించేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ సమాఖ్య మార్కెట్ నిర్మాణానికి కృషి చేయాలని సంస్థ చైర్మన్ కన్నేబోయిన రాజయ్య యాదవ్‌కు కవిత సూచించారు. బోధన్ నియోజకవర్గంలో గొల్ల కులస్తులకు భవనం కోసం రూ.50 లక్షలు, అలాగే కురుమ భవన్‌కు రూ. 50 లక్షలు కవిత మంజూరు చేశారు. గొల్ల కురుమలకు ఏదైనా సమస్య ఉంటే ఒక మెసేజ్ చేస్తే చాలు పరిష్కరించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం ఎంపీ కవితను గొల్ల కురుమ నాయకులు గజమా లతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్,  టిఎస్‌రెడ్ కో చైర్మన్ ఎస్.ఏ అలీం తదితరులు పాల్గొన్నారు.

English Title
KCRR Bhola Sankara
Related News