105 అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్?

Updated By ManamFri, 09/14/2018 - 13:29
KCR Phone Call To 105 party condidates Over compaigning and Elections

kcr phone call to party condidates

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.... టికెట్లు కేటాయించిన 105 మంది అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. గురువారం సాయంత్రం ఆయన ఒక్కో అభ్యర్థితో నాలుగు నిమిషాలు పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. 

అలాగే బూత్ కమిటీల నియామకాలతో పాటు, పార్టీ నేతలందరితో సమన్వయంతో పని చేసుకోవాలని గులాబీ బాస్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రచారన్ని ముమ్మరం చేయాలని సూచించడంతో పాటు,  ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తామే తీసుకుంటామని కేసీఆర్... అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ నెల 2వ తేదీన రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ ‘ప్రగతి నివేదన సభ’లో కేసీఆర్ 105మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

English Title
KCR Phone Call To 105 party condidates Over compaigning and Elections
Related News