హస్తినకు కేసీఆర్

Updated By ManamThu, 06/14/2018 - 07:18
kcr
  • రేపు 12 : 30 గంటలకు ప్రధానితో భేటీ

  • రాష్ట్ర పెండింగ్ అంశాలపై చర్చ.. నేడు కేంద్ర మంత్రులతోనూ చర్చలు

  • ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తరువాత మొదటిసారి మోదీతో సమావేశం

kcrహైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. గురువారం నాడు ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై మంత్రులతోనూ, ప్రధాన మంత్రితోనూ ఆయన చర్చించనున్నారు.

మే 28న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో అపాయిం ట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ప్రధాన మంత్రిని కలుసుకోలేకపోయారు. ఆ పర్యటనలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కొత్త జోన్‌ల వ్యవస్థ ఆమోదంపై చర్చించారు. పీఎంతో సమావేశం సందర్భంగా ఈ విధానాన్ని అమోదింపజేయాల్సిందిగా కోరనున్నారు.  

ఇటీవల కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫెడర్ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకు వచ్చారు. ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే మాజీ ప్రధాన మంత్రి, కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని, పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీని , డిఎంకే అధ్యక్షుడు కరుణానిధిని, ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోనూ ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరిపారు. ఢిల్లీకి బయలుదేరే ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలుసుకున్నారు. 

English Title
kcr dellhi tour
Related News