గ్రీన్ ఛాలెంజ్‌లో కల్వకుంట్ల కవిత

Updated By ManamSun, 07/22/2018 - 01:08
kavitha
  • మొక్కలు నాటి ముగ్గురికి సవాల్ విసిరిన ఎంపీ

kavithaహైదరాబాద్: హారితహారం గ్రీన్ ఛాలెంజ్‌లో ఒకరితరువాత ఒకరుగా పాల్గొంటూ దాన్నొక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. తాజాగా ఎంపీ కవిత తన ఇంటిలో శనివారం మూడు మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా..  బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.   తాము ఈ చాలెంజ్‌ను స్వీక రిస్తున్నామని, త్వరలో మొక్కలు నాటుతామని  వారు ప్రకటిం చారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఛాలెంజ్‌ను స్వీకరించిన కవిత శనివారం మూడు మొక్కలు నాటి, మరో నలుగురికి చాలెంజ్ విసిరారు. మొక్కలు నాటే కార్యక్రమం పోటీ తత్వంతో సాగేలా చేయడం ఛాలెంజ్ కార్యక్రమం ఉద్దేశ్యంగా నడుస్తొంది. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దీంతో తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, అతివృష్టి లేదంటే అనావృష్టి, వాతావరణ మార్పులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ  అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఎంపీ కవిత పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆమె కోరారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. మొక్కలు నాటడమే కాదు..ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని ఎంపి కవిత కోరారు.

Tags
English Title
Kavvakundala poem in Green Challenge




Related News