ఆకర్షణీయ నగరంగా కాశి

Updated By ManamTue, 06/12/2018 - 00:04
KASHI

imageస్మార్ట్ సిటీ (ఆకర్షణీయ నగరం)గా ఎంపికైన నగరా లలో కాశీ కూడా ఉంది. 2016 సెప్టెంబర్‌లో స్మార్ట్ సిటీల ఎంపికకు నిర్వహించిన పోటీలో రెండవ రౌండులో కాశీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. కాశీ స్మార్ట్ సిటీ ప్రణాళిక ప్రకారం, ‘‘అత్యంత పురాతన నగర మైన కాశీ లేదా వారణాసిని అందరూ జీవించడానికి వీలైన ఓ మహానగరంగా పునరుజ్జీవింపచేయడానికి, తన పురాతన వారసత్వ సంపదను, సంస్కృతిని, ఆధ్యాత్మికతను కాపాడుకుంటూనే, నిత్యనూతన సా మాజిక కార్యక్రమాలు, పరిష్కారాల ద్వారా అభివృద్ధి చేయడానికి’’ ఎంపిక చేశారు. కాశీ నగర విశిష్టతను, ఆధ్యాత్మికతను కాపాడుతూనే దానికి ‘స్మార్ట్’ లక్షణా లను కూడా జతచేయడం ప్రధానోద్దేశం. మొత్తం మీద కాశీ పురాతనత్వం చెక్కు చెదరదని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దాని స్మార్ సిటీ ప్రస్థానంలో అదె క్కడా తన పురాతన విలువలను కోల్పోదు.

కాశీ స్మార్ట్ ప్రణాళికను మౌలికంగా మూడు కేట గిరీలుగా విభజించవచ్చు. ఇవి: మౌలిక సదుపా యాలు, సేవలు కల్పించడం, డిజిటల్  టెక్నాలజీని వర్తింపజేయడం, స్థానికులు, పర్యాటకులు సకల సౌక ర్యాలతో నివసించేలా చేయడం. ప్రతి కేటగిరీలోనూ వివిధ అంశాలు ఉంటాయి. ప్రాజెక్టుల రూపంలో వీటి ని అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, ప్రతి కేటగిరీలోనూ వివిధ దశల పురోగతి వగైరాలను ఈ కింద తెలియజేయడం జరిగింది.

మౌలికమైన ప్రాథమిక సదుపాయాలు
ఈ కేటగిరీ కింద అన్ని ఇళ్లకూ మురుగునీటి, తాగునీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చే ప్రాజెక్టులను తీసు కుంటారు. ‘స్మార్ట్’ తరగతి గదులు ఏర్పాటు చేస్తారు. చెత్తా చెదారం వంటి వృథా పదార్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటారు. ‘స్మార్ట్’ విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మెరుగుదల, పేదలకు, వితంతువులకు ఇళ్ల నిర్మాణం వంటి చర్యలు కూడా చేపడతారు. ప్రతి కు టుంబానికి నాణ్యమైన జీవనాన్ని అందించడానికి తీసుకోవాల్సిన కీలక చర్యలు ఏమిటంటే, ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయడం, మరుగుదొడ్లకు మురుగునీటి సరఫరా కనెక్షన్ ఇప్పించడం. 2018 మార్చిలో గోయితాలో ఏర్పాటు చేసిన 120 ఎం.ఎల్. డి మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తయిందంటే, ప్రతి ఇంటికీ మురుగునీటి సరఫరా కనెక్షన్ ఏర్ప డినట్టే. ఈ ఏడాది జూలై నాటికి నగరంలో 50,000 కనెక్షన్లు పూర్తవుతాయని అంచనా. ఇంతకు ముందు 23 ఓవర్‌హెడ్ టాంకుల నిర్మాణం పూర్తయింది. కానీ, నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను మాత్రం ఇంతవరకూ నిర్మించ లేకపోయారు. ప్రస్తుతం సారనాథ్‌లో 100 ఎం.ఎల్.డి సీవేజ్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటే అమృత్ పథకం కింద ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేయడంలో భాగంగా, 50,000 కొళాయిలు ఏర్పాటు చేయబోతున్నారు.

నగరంలో చేపట్టబోయే ‘స్మార్ట్’ నిర్మాణంలోని మరో అంశం ఏమిటంటే, వ్యర్థ పదార్థాల నిర్వహణ. వ్యర్థ పదార్థాల నిర్వహణ పథకం ప్రకారం, ‘కూడా’ ఘర్‌ల స్థానంలో బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేయ డం జరుగుతుంది. అదనపు వాహనాలను సమకూ ర్చుకోవాల్సి ఉంటుంది. వార్డుల ప్రకారం సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. పారదర్శకత, జవాబు దారీతనం వగైరాలను సాధించడానికి డిజిటల్ టెక్నా లజీని అధికంగా వినియోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రస్తుతం అమలులో ఉన్నాయి. నగరంలో ఐఓసీఎల్ నిధులతో ఏర్పాటు చేయదలిచిన 10 వికేంద్రీకృత బయోమెథనైజ్డ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మూడు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. ఈ మూడు ప్లాంట్ల పనితీరును సమీక్షించిన తర్వాత మిగిలిన ఏడు ప్లాంట్ల ఏర్పాటు కూడా ప్రారంభమవుతుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, కాశీకి చుట్టు పక్కల ఉన్న 13 గ్రామాల్లో కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కాశీ స్మార్ సిటీలో ప్రతి వ్యక్తికీ గూడు ఉండాలన్నదే లక్ష్యం. అందరికీ ఇల్లు పథకం కింద ఇప్పటికే 5,825 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.
 
డిజిటల్ టెక్నాలజీ వినియోగం
స్మార్ట్ సిటీ సెంటర్ (ఇంటెగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్)ను నిర్మించడానికి ప్రయత్నాలు  ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ, స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ, వీధి దీపాల వ్యవస్థ, జి.ఐ.ఎస్, ఇ-గవర్నెన్స్, నిఘా కెమెరాల వ్యవస్థ, వీడియో మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, డేటా సెంటర్ వంటి అనేక వ్యవస్థలను ఇందులో కలిపారు. ప్రస్తు తం నిర్మాణ దశలో ఉన్న ఈ స్మార్ట్ సిటీ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. నగర పాలక సంస్థ కార్యకలాపాలకు ఈ స్మార్ట్ సిటీ సెంటర్ ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంటుంది? మునిసిపల్ కార్మికులు తమంతట తాముగా తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇది దోహదం చేస్తుంది. పర్యవేక్షణ కూడా దానంతటదే కొనసాగు తుంది. దీనివల్ల వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా చౌకగా సాగిపోతుంది. మునిసిపల్ కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

జీవన విధానం మెరుగుదల
కాశీలో ఉండే స్థానికులతో పాటు, ఈ ఆధ్యాత్మిక నగరానికి నిత్యం వచ్చే వేలాది మంది యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం ఇందులో ప్రధానాంశం. యా త్రికులు ఈ నగరంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వీరికి సౌకర్యాల అనుభవం ప్రారంభమవుతుంది. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని బస్టాండ్‌ను పున ర్నిర్మిస్తున్నారు. పాదచారుల కోసం కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీరికి కొత్త అనుభవం కలిగేటట్టు చర్య లు తీసుకుంటున్నారు. హృదయ్ పథకం కింద 28 రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరో ఆరు రోడ్లు కూడా నిర్మాణం కాబోతున్నాయి. ఇందులో పదిరోడ్లు స్థాని కతకు అద్దం పడుతుంటాయి. వీటి పురాతనత్వం యథాతధంగా కొనసాగుతుంది. ఈ పనులను ఇన్‌టాక్ సంస్థ చేపట్టింది.

ఇక 50 కిలోమీటర్ల రోడ్లను కొన్నిటిని డిజైన్ చేస్తున్నారు. 15 కిమీల పొడవున్న 16 జంక్షన్లను నిర్మించడం కూడా ప్రారంభమైంది. ఈ రోడ్లన్నీ చివ రికి గంగానదికే దారితీసే విధంగా నిర్మాణమవు తున్నాయి. గోడమలియా చౌక్‌లో పెద్ద బహుళ స్థాయి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీధి వ్యాపారులకు కూడా స్థలం కేటాయించడం అవసరం. సుమారు 24,000 మంది వీధి వ్యాపారులు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా, 167 వెండింగ్ జోన్లను గుర్తించారు. వీటన్నిటి వల్లా ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. కాశీ అనేసరికి గుళ్లు గోపురాలు, కుండ్‌లు, ఘాట్లు గుర్తుకు వస్తాయి. కుండ్‌లు, చెరు వుల పునర్నిర్మాణం ఈ స్మార్ట్ సిటీ ప్లాన్‌లో భాగమే. దుర్గా, లక్ష్మీ, లాట్‌భైరవ్ కుండ్ల మీద నిర్మాణ కార్య క్రమాలు పూర్తయ్యాయి. పుత్రి కుండ్, ఈశ్వర్ గంగీ, శకుల్ ధారా కుండ్ల నిర్మాణం హృదయ్ పథకం కింద రూపుదిద్దుకుంటోంది. స్మార్ట్ సిటీ ప్లాన్ కిందే మందా కినీ కుండ్, సూరజ్ కుండ్‌ల పునరుద్ధరణ కొనసా గుతోంది. మరో 10 కుండ్‌ల నిర్మాణం కూడా చేపట్టా లని కార్యక్రమాలు రూపొందించారు. దర్భాంగా ఘాట్ నుంచి దశాశ్వమేధ్ ఘాట్ వరకు అనేక ఘాట్లను 500 మీటర్ల పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

భారీగా పార్కుల నిర్మాణం
ఇది ఇలా ఉండగా మరో 11 పార్కుల నిర్మాణం కూడా ప్రారంభ దశలో ఉంది. అమృత్ కింద 7 పార్కుల నిర్మాణం ప్రారంభమైంది. ఇవి త్వరలో పూర్తవుతాయి. శాస్త్రి, గులాబ్ బాగ్, రవీంద్ర పురి, మచ్చోదరి పార్కుల పునర్నిర్మాణం కూడా స్మార్ట్ సిటీ ప్లాన్ కింద ప్రారంభమైంది. నార్త్, సౌత్ బ్లాక్‌ల దీపా లంకరణకు ఇప్పటికే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాశీ నగరంలో దీపాలంకరణ నిమిత్తం మరో 13 ముఖ్యమైన భవనాలను ఎంపిక చేశారు. ఇందులో దశాశ్వమేధ్ ఘాట్, దర్భాంగా ఘాట్, టౌన్ హాల్, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, దుర్గా మందిరం, తులసీ మానస్ మందిరం, పాత కాశీ విశ్వనాథ్ దేవాలయం, బీహెచ్‌యూ కాశీ విశ్వనాథ్ దేవాలయం, సారనాథ్ మ్యూజియం, రాజ్‌ఘాట్ రైల్వే బ్రిడ్జి, సామ్నే బ్రిడ్జి, మణికర్ణికా గేటు కూడా ఉన్నాయి.
కాశీలో కొన్ని ప్రధాన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. జేఐసీఏ సహాయ సహకారాలతో ఇరవై లక్షల యెన్ల వ్యయంతో, కాశీలో అత్యంత ఆధునిక కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించడం జరుగుతోంది. ఇది 2019 నాటికి పూర్తవుతుందని ఆశిస్తున్నారు. టౌన్ హాల్ పునర్నిర్మాణం పూర్తయింది. వారణాశి నగర నిగమ్ భవన పునర్నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. మన్‌మందిర్‌లో డిజిటల్ మ్యూజియం నిర్మాణమైంది. సిగ్రాలోని స్టేడియంని అహ్మదాబాద్‌లోని స్టేడియం మాదిరిగా అత్యద్భుతంగా పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడి తో ఆగిపోలేదు. ఈ జాబితాలో ఇంకా ఎన్నో నిర్మాణ కార్యక్రమాలున్నాయి.

image
 

 

 

 

 

 

(రచయిత కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి. ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహించిన వ్యక్తి. అభిప్రాయాలు వ్యక్తిగతం)

English Title
Kasi as a smart city
Related News