కరుణానిధి కాంస్య విగ్రహం ఆవిష్కరణ..

Karunanidhi, Karunanidhi bronze statue, inaugurate, Sonia gandhi
  • చెన్నై డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమం

  • విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

చెన్నై: తమిళనాడులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆదివారం దివంగత నేత కరుణానిధి కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్, కేరళ సీఎం పినరయ్ విజయన్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్‌‌తో పాటు సోనియా, రాహుల్, చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. కరుణానిధి విగ్రహాన్ని సోనియా ఆవిష్కరిస్తుండగా రాహుల్ గాంధీ తన మొబైల్‌లో ఫొటోను తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు