‘ఆర్‌ఎక్స్100’ హీరో కొత్త మూవీ ప్రారంభం

Updated By ManamFri, 11/09/2018 - 10:46
Hippi

Hippi‘ఆర్‌ఎక్స్100’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యువ హీరో కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేశాడు. కొత్త దర్శకుడు టిఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘హిప్పి’ అనే సినిమాలో కార్తికేయ నటిస్తుండగా.. ఈ చిత్ర షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా.. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో తమిళ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కార్తికేయ అక్కడ ఏ మేరకు విజయాన్ని సాధిస్తాడో చూడాలి.

English Title
Karthikeya's Hippi shooting started
Related News