ఆమె చెవులు, ముక్కు కోస్తాం: కర్ణిసేన

Updated By ManamThu, 06/14/2018 - 09:39
kiran

Kiran రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరి ముక్కు, చెవులు కోస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ‘‘వచ్చే ఎన్నికల్లో సర్వ్ రాజ్‌పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోతున్న వార్తలు నిజమేనా’’ అన్న ప్రశ్నకు.. ‘‘వర్షాకాలంలో కలుగు నుంచి బయటికి వచ్చే ఎలుకల లాంటి కొందరు వ్యక్తులు ఎన్నికల సమయంలో బయటకు వస్తారు’’ అంటూ రాజ్‌పుత్ వారిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘పద్మావతి వివాదాన్ని మహేశ్వరి మరిచిపోయినట్లున్నారు. రాజ్‌పుత్‌ల వల్లే బీజేపీకి రాజస్థాన్‌లో బలం వచ్చింది. మహేశ్వరి అన్నట్లే ఆమె నియోజకవర్గంలో40వేల ఎలుకల వల్లే గత ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తప్పకుండా బుద్ధి చెప్తాం. తన వ్యాఖ్యలపై మహేశ్వరి వెంటనే క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలి. మహిళలను మేము గౌరవిస్తాం. కానీ హద్దులు దాటి మాట్లాడే మహిళలను ఎప్పటికీ సహించం’’ అంటూ కర్ణిసేన చీఫ్ మహిపాల్ మక్రానా వీడియోను విడుదల చేశారు.

దీంతో ఈ విషయంపై స్పందించిన మహేశ్వరి.. తన మాటలు రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించినవి తప్ప రాజ్‌పుత్‌ల గురించి కాదని తెలిపింది. మరి ఈ వివాదం ఇప్పటికైనా సద్దుమణుగుతుందేమో చూడాలి.

English Title
Karnisena threatens to Rajasthan Minister
Related News