కళ్ళు తెరిపించిన ‘కర్ నాటకం’

Updated By ManamMon, 06/11/2018 - 23:52
POLITICS

imageనల్లధనం బయటకు తెప్పిస్తాం, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది భారతీయ జన తా పార్టీ. అందుకు అనుగుణంగానే నోట్లరద్దు చేపట్టింది. ఐతే ఈ నోట్ల రద్దు ఉద్దేశం మారి నల్లధనం రాకపోగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది మోదీ తీసుకున్న ఈ నిర ్ణయం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు ఎన్నికలు అధికారం ఎజెండాగానే ముందుకెళ్తోంది తప్పిస్తే ప్రజల గురించి ఆలోచించడం లేదు. 60 ఏండ్లలో సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. అవినీతికి కేరాఫ్‌గా కాంగ్రెస్ నిలిచింది. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తీశారు. ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీకి బంపర్ మెజారిటీని కట్టబెట్టారు దేశ ప్రజలు. ఐతే ఆ ప్రజల నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పవచ్చు.  ప్రజల ఇబ్బందులతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించాలనే తపన, ఆశ ఆ పార్టీలో కనపడు తోంది. ఈ మోజులో పడి దేశ అభివృద్ధిని తుంగలో తొక్కు తోంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అవ లంభించిన తీరు ఆ పార్టీ ప్రతిష్టను దేశవ్యాప్తంగా మసక బార్చిందనే చెప్పవచ్చు. ఎన్నికలో ఎవరికి అధికారం చేపట్ట డానికి కావలసిన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ జేడీఎస్ కలిస్తే అధికారానికి కావాల్సిన మెజారిటీ ఉంది. ఐతే యాడ్యూరప్ప ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, అనంతరం జరిగిన పరిణామాలు దేశ ప్రజలను ఆలోచింపజేశాయి.

అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నా లను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం కోసం వారు తొక్కు తున్న అడ్డదారులను వారు గమనిస్తున్నారు. ప్రజలను మరిచి పదవులు, అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్న కాంగ్రెస్, బీజేపీల తీరును దేశ ప్రజలు కర్ణాటక ఎన్నికల సాక్షిగా శ్రద్ధగా గమనించారు. ఒక పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి వారిని తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో దాచిపెట్టు కొనే స్థితి. మాకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బహి రంగంగా మీడియా ముందు చెప్తున్న నాయకులు ఇదీ ఈ దేశ రాజకీయ పరిస్థితి. అధికారానికి కావాల్సినంత బలం లేన ప్పుడు తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. కానీ బలం లేని చోట బలవంతంగా అధికారం సంపాదిస్తే అది ఉన్న బలా న్నంతా దెబ్బతీస్తుంది. ఇక్కడ అదే జరిగింది.
ఈ ఎన్నికతో దేశ ప్రజలు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ చెప్పినట్టు ఈ దేశ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ కూట మి అవసరం తప్పక ఉందని వారు గమనిస్తున్నారు. కర్ణాటక ఎన్నికలో జేడీఎస్ కీలకపాత్ర పోషించింది. కింగ్ మేకర్ అవు తుందనుకుంటే కింగ్ అయి కూర్చుంది. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి తలెత్తనుందనటంలో సందేహం లేదు. కాంగ్రెస్, బీజే పీల తీరుకు ప్రజలు విసిగివేసారిపోయారు. ఇక మార్పు అని వార్యం. ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజులు ఆగిన ప్రజలు ప్రత్యామ్నాయం వస్తే తప్పకుండా దానికి అండగా నిలవడా నికి సిద్ధపడుతున్నారు.

70 ఏండ్లుగా ఎన్నికలు ఓట్లు, సీట్లు అధికారం ఇవే కేం ద్రంగా ఈ రెండు పార్టీలు పనిచేశాయి. ఏనాడూ ప్రజల బాగు కోసం పాటుపడలేదు. అద్వాని, వాజ్‌పాయ్ లాంటి నాయకులు ఉన్న బీజేపీకి ఇప్పుడు మోదీ, షాల నేతృత్వంలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉంది. వాజ్‌పాయ్ హయాంలో అవినీతి రహిత, అధికారవాంఛలేని పాలన సాగింది. కానీ నేడు ఎక్కడ ఎన్నిక జరిగినా తామే అధికారం చేపట్టాలంటూ ఎమ్మెల్యేలను సైతం బహిరంగంగానే కొంటూ అధికారం కో సం బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించింది బీజేపీ, కానీ కాంగ్రెస్ జేడీఎస్ కలిసి మ్యాజిక్ చేసి వాళ్ళు అధికారం చేపట్టారు. కానీ ఇక్కడ బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకోకుండా డ్రామా నడిపించిం ది. వారికి అధికారం దక్కడానికి కావాల్సిన అన్ని విద్యలను అమలు చేసింది. అవినీతికి ఆమడదూరం అన్న బీజేపీ... పెద్ద స్కాంలో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బేరసారాలాడిన ఆడియో క్లిప్పింగ్ హల్‌చల్ చేసింది. ఇదే భారతీయ జనతా పార్టీ గోవా, మణిపూర్‌లలో తక్కువ సీట్లు సంపాదించి ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. కానీ ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అలా చేస్తే బీజేపీ అడ్డుపడింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగు తోంది. కాంగ్రెస్‌తో విసుగెత్తి బీజేపీకి బంపర్ మెజారిటీ కట్ట బెడితే అంతకంటే ఘోరంగా బీజేపీ రాజకీయం చేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కాంగ్రెస్ సైతం ఎక్కువ సీట్లు గెలిచి కూడా జీడీఎస్‌కు ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పడం చర్చానీయాంశమైంది.

కేసీఆర్ చెప్పినట్టు ఈ దేశంలో ఆ పార్డీలపై ప్రజలు వి శ్వాసం కోల్పోయారు. వారి ఆగడాలను చూస్తూ ఇక ఆ పార్టీ లకు స్విస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దేశం ఆలోచన లో పడింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకో కుం డా ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ అన్ని రేట్లు పెంచుకుంటూ వెళ్తున్న పార్టీకి బుద్ధిచెప్పి నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన ప్రజల్లోకి చేరింది. ఫెడరల్ ్రఫంట్ అవ సరం తెలిపింది. కర్ణాటక ఎన్నిక ఆ పార్టీలు చేస్తున్న నీచ రాజకీయంతో దేశం వెనక్కివెళ్తుంది తప్ప పురోగతి సాధించ లేకపోతుంది.

తెలంగాణలో ఏ పార్టీతో సంబంధం లేకుండా కావాల్సిన మెజార్టీ సీట్లు సాధించి తెరాసా అధికారం చేపట్డింది. తర్వాత కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉనికిని కోల్పోతున్న ఇతర పార్టీలు, ఆంధ్ర నాయకత్వం కలిగిన పార్టీల తీరు నచ్చక తెరాసాలో ఎమ్మెల్యేలు చేరారు. కేసీఆర్ వారిని లాక్కో లేదు. డబ్బులు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వారు చేరారు. కానీ కర్ణాటకలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా విరుద్ధం.

కర్ణాటక ఎన్నికలు దేశ ప్రజల కళ్ళు తెరిపించాయి. ప్రజల ఆశలను ఆవిరి చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ప్రజలు అర్థం చేసు కున్నారు. దేశంలో మరో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటుకు కర్ణా టక ఎన్నికలే ఒక బలమైన పునాది వేశాయనడంలో సం దేహం లేదు.
- టి. విజయ్
9491998702

English Title
KARNATAKA EFFECT
Related News