కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్

Updated By ManamWed, 06/06/2018 - 15:56
Karnataka Cabinet Expansion, Full List of HD Kumaraswamy Ministers

Karnataka Cabinet Expansion, Full List of HD Kumaraswamy Ministers బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర సీఎం కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేడీఎస్‌ నేత కుమారస్వామి రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు గడిచిన అనంతరం మంత్రి పదవుల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. దాంతో ఈ రోజు కర్ణాటక కేబిటెన్‌లో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్‌ వజుభాయి వాలా రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ నుంచి 14 మంది, జేడీఎస్‌ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యనేత, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డీకే. శివకుమా్‌ర్‌కు నీటిపారుదల‌, వైద్యవిద్య మంత్రిత్వ శాఖలు అప్పగించారు. హోం శాఖ కాంగ్రెస్‌కు అప్పగించగా, ఆర్థిక శాఖ జేడీఎస్‌కు దక్కింది.

బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మహేశ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించింది. కేజీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి దక్కింది. కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవులు దక్కిన వారిలో శమనూరు శివశంకరప్ప, డీకే శివకుమార్‌, కేజే జార్జ్‌, కృష్ణ బైర్‌ గౌడ, రాజశేఖర్‌ పాటిల్‌, ఆర్‌వీ దేశ్‌పాండే, యూటీ ఖడార్‌, జమైర్‌ అహ్మద్‌ ఖాన్‌, పుట్టరంగ శెట్టి, శివశంకర రెడ్డి, హెచ్‌కే పాటిల్‌, ప్రియాంక ఖర్గే, శివానంద్‌ పాటిల్‌, జయమాల, కాగా, జేడీఎస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారిలో హెచ్‌డీ రేవన్న, జీటీ దేవెగౌడ, బండప్ప కశంపుర్‌, సీఎస్‌ పుట్టరాజు, వెంకటరావ్‌ నాదగౌడ, హెచ్‌కే కుమారస్వామి, ఎస్‌ఏ ఆర్ఏ మహేశ్‌ మంత్రివర్గంలో పదవి దక్కింది.

English Title
Karnataka Cabinet Expansion: Full List of HD Kumaraswamy Ministers
Related News