చంద్రబాబును ఓడించడమే కాపుల లక్ష్యం..!

Updated By ManamWed, 07/11/2018 - 22:05
Kapu Leader Mudragada Sensationsal Comments On CM Chandrababu

Kapu Leader Mudragada Sensationsal Comments On CM Chandrababu

అమరావతి: రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఓడించడమే మా లక్ష్యమని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కాపు జాతి రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును సముద్రం కలుపుతామన్నారు. 

కాపు రిజర్వేషన్లపై.. కచ్చితమైన హామీ ఏ పార్టీ ఇస్తుందో వారికే కాపుజాతి మద్దతిస్తుందని ముద్రగడ తేల్చిచెప్పారు. బీజేపీ, టీడీపీలు సఖ్యతగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లును పంపలేదని.. బీజేపీ నుంచి టీడీపీ విడిపోయాక బిల్లును పంపారని ముద్రగడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల కోసం టీడీపీ దీక్షలు చేస్తున్నారని.. మా హక్కుల కోసం దీక్షలు చేస్తే అడ్డుకుంటున్నారెందుకు? అని సర్కార్‌కు సూటి ప్రశ్న సంధించారాయన.

English Title
Kapu Leader Mudragada Sensationsal Comments On CM Chandrababu
Related News