రివ్యూ: క‌న్నుల్లో నీ రూప‌మే..

Updated By ManamFri, 06/29/2018 - 19:16
Kannullo Nee Roopame movie Review, Nandu, Bhaskar Basani

బ్యాన‌ర్‌: ఎ.ఎస్‌.పి.క్రియేష‌న్స్
న‌టీన‌టులు: న‌ందు, తేజ‌స్విని ప్ర‌కాశ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు
సంగీతం:  సాకేత్‌
కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి
నిర్మాత‌:  భాస్క‌ర్ బాసాని
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  బిక్స్ ఇరుస‌డ్ల‌

Kannullo Nee Roopame movie Review, Nandu, Bhaskar Basaniహీరోగా స‌క్సెస్ కావ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. నాగ‌చైత‌న్య ఆటోన‌గ‌ర్ సూర్య‌, 100% లవ్ చిత్రాల్లో కీల‌క పాత్ర పోషించిన న‌టుడు నందు. హీరోగా రాణించాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.  అలాంటి ప్ర‌య‌త్నంలో భాగ‌మే `క‌న్నుల్లో  నీ రూప‌మే`. ప్రేమ స‌క్సెస్ కావ‌చ్చు. ఫెయిల్యూర్ కావ‌చ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన ఏదో అయిపోన‌క్క‌ర్లేదు అనే పాయింట్‌తో బిక్స్ తెరెక్కించినే ప్రేమ క‌థా చిత్రం `క‌న్నుల్లో నీ రూప‌మే`.  వైరైటీ కోసం బిక్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యిందో తెలుసుకోవాలంటే క‌థేంటో తెలుసుకుందాం.

క‌థ‌:
స‌న్ని(నందు) త‌న జీవితంలో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ను చెప్ప‌డం స్టార్ట్ చేయ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. సృష్టి(తేజ‌స్వి ప్ర‌కాశ్‌)ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. సృష్టికి కూడా డా స‌న్ని అంటే ఇష్ట‌మున్నా కూడా ముందు చెప్పదు. స్నేహితురాలి పెళ్లిలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఇంకా పెరుగుతుంది. క్ర‌మంగా అది ప్రేమగా మారుతుంది. అయితే సృష్టి అన్యయ్య ఆమెకు వేరే సంబంధం చూస్తాడు. అత‌నికి ప్రేమ పెళ్లిలంటే ఇష్టం ఉండ‌దు. అత‌నికి తెలియ‌కుండా ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. వారంలో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి వెళ్లిన స‌న్ని నాలుగు రోజులు ఎవ‌రికీ క‌న‌ప‌డ‌డు. ఐదో రోజు వ‌చ్చిపెళ్లి చేసుకుంటాన‌ని పెళ్లి ప‌నులు ప్రారంభిస్తాడు. కానీ స‌న్ని ఏదో పొగొట్టుకున్న‌వాడిలా చాలా దిగులుగా ఉంటాడు. అస‌లు స‌న్ని బాధ‌కు కార‌ణ‌మేంటి? స‌న్ని, సృష్టిల ప్రేమ స‌క్సెస్ అవుతుందా?  లేదా? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

స‌మీక్ష‌: 
న‌ట‌న ప‌రంగా నందు, తేజ‌స్విని ప్ర‌కాశ్ చ‌క్క‌గా న‌టించారు. ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సాకేత్ పాటలు ప‌రావాలేదు. నేప‌థ్య సంగీతం బావుంది. ఇక విశ్వకాంత్ , సుభాష్ దొంతి కెమెరా వ‌ర్క్ కొన్ని స‌న్నివేశాల్లో చాలా బావున్నా.. కొన్ని స‌న్నివేశాల్లో డ‌ల్‌గా అనిపించాయి. పోసాని, నుందు మ‌ధ్య వ‌చ్చే క్లైమాక్స్ సీన్స్ బావున్నాయి. ప్రేమ‌కు చాలా అడ్డంకులు ఉంటాయి. వాటిని దాటి స‌క్సెస్ సాధించాలంటే  చిన్నపాటి అదృష్టం కూడా ఉండాలి. అది లేన‌ప్పుడు ఎంత ప్రేమ ఉన్నా స‌క్సెస్ కాదు. అలాగని ప్రేమ విఫ‌లం అయితే చ‌నిపోవాలా?  ఎందుకు చ‌నిపోవాలి?  స్వ‌చ్చ‌మైన ప్రేమ చావుని కోరుకుంటుందా? అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు బిక్స్ తెర‌కెక్కించిన చిత్రమే ఇది. సినిమా మెయిన్ థీమ్‌ను చివ‌రి వ‌ర‌కు మెయిన్‌టెయిన్ చేయ‌డంలో బిక్స్ పెద్ద స‌క్సెస్ సాధించాడు. రెండు అర్థ బాగాల‌ను.... స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకోవ‌డం స‌క్సెస్ అయ్యారు బిక్స్. 

ప్ర‌థ‌మార్థంలో హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలతో సినిమా ఆసాంతం స‌ర‌దాగా సాగిపోతుంది. హీరోకి, హీరోయిన్‌పై ప్రేమ పుట్ట‌డం అనే పాయింట్ కూడా బావుంది. అలాగే పెళ్లి సందర్భంలో ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు బావున్నాయి. స్నేహితులు, వారి మ‌ధ్య వ‌చ్చే కామ‌డీ ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇంట‌ర్వెల్‌లో నందు గురించి తెలిసే సీక్రెట్ షాకింగ్‌గా ఉంటుంది. త‌ర్వాత  అస‌లు అలా ఎందుకు జ‌రిగింద‌నేది స‌న్నివేశాల ప‌రంగా ముందుకు సాగుతుంది. చివ‌ర్లో నిజ‌మైన ప్రేమ ఏం కోరుకుంటుంద‌నే పాయింట్‌ను ద‌ర్శ‌కుడు వివ‌రించిన తీరు అభినంద‌నీయం. ఇక నిర్మాత భాస్క‌ర్ మేకింగ్‌లో ఎంత మేర ఖ‌ర్చు పెట్టాలో కాంప్ర‌మైజ్ కాకుండా పెట్టిన‌ట్లు ఉన్నాడు. ఇక నందు, పోసాని మ‌ధ్య స‌న్నివేశాల‌ను.. నందు బ్యాచ్‌లో మ‌రో అమ్మాయిని భ‌య‌పెట్టే స‌న్నివేశాలు.. ఫిష్ వెంక‌ట్, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ మ‌ధ్య కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. అలాగే ఎక్క‌డా ఓవ‌ర్ హార‌ర్ స‌న్నివేశాలు లేకుండా హార్ట్ ట‌చింగ్ స‌న్నివేశాల‌తో క‌థ సాగుతుంది. అలాగే క్లైమాక్స్ బావుంది. 

బోటమ్ లైన్‌: క‌న్నుల్లో నీ రూప‌మే ... ఆక‌ట్టుకునే ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 3/5

English Title
Kannullo Nee Roopame movie Review
Related News