'ఎన్నికల లబ్ధి కోసమే కేంద్రంపై విమర్శలు'

Updated By ManamThu, 07/12/2018 - 19:20
Kanna Laxminarayana, TDP leaders, BJP president, Railway zone

Kanna Laxminarayana, TDP leaders, BJP president, Railway zoneవిశాఖ: ఎన్నికల లబ్ధి కోసమే కేంద్రంపై టీడీపీ బురద జల్లుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని ఆయన చెప్పారు. గురువారం విశాఖలో కన్నా మీడియాతో మాట్లాడుతూ... పోలవరం సహాయక పునరావాస ప్యాకేజీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల భూ రికార్డులను మార్చేసిన టీడీపీ నేతలు వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన విమర్శించారు. విశాఖ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరించిదని ఈ సందర్భంగా కన్నా గుర్తు చేశారు. రైల్వే జోన్‌ హామీ నెరవేర్చడానికి పదేళ్ల సమయం ఉందని, కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోన్‌ను ఇస్తుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు. 

English Title
Kanna Laxminarayana slams TDP govt
Related News