‘చీర మాయం’లో ఆ నలుగుర్ని ప్రశ్నించాలి..

Updated By ManamFri, 08/10/2018 - 18:04
kodela suryalatha
kodela suryalatha

విజయవాడ : కనకదుర్గమ్మ ఆలయంలో ఉత్సవ విగ్రహానికి కట్టిన పట్టుచీర మాయమైన వ్యవహారం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అమ్మవారి చీర మాయమైన ఘటనలో... వేటుపడిన పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత తాజాగా పలువురిపై ఆరోపణలు చేశారు. పట్టుచీర మాయంపై దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబుతో పాటు సభ్యుడు శంకర్ బాబును ప్రశ్నించాలని సూర్యలత డిమాండ్ చేశారు. 

అలాగే పట్టుచీర  మాయమైన విషయం దుర్గగుడి వైదిక్ కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్యా, పూజారి రమేష్‌ తెలుసునని, ఆ నలుగురిని ఒకే వేదికపై ప్రశ్నిస్తే అసలు విషయంవ వెలుగులోకి వస్తుందన్నారు. నెలక్రితమే రూ.50 లక్షల విలువైన చీరల మాయంపై నివేదిక ఇచ్చానని, దానిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అన్ని విషయాలు వివరిస్తామని తెలిపారు.

కాగా కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన విలువైన పట్టుచీర ఇటీవల మాయం కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో పాలకమండలి నుంచి ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి కొనసాగింపుగానే ఈవో పద్మను బదిలీ చేసింది. ఉత్సవ విగ్రహానికి ఉండాల్సిన పట్టుచీర మాయమైన వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లడంతో.. ఆయన పాలకమండలితో పాటు అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
Kanaka Durga temple saree missing: Kodela Surya Latha allegations against Board chairman
Related News