మలయాళ కుట్టీ.. తొలిసారి మాలీవుడ్‌లో..?

Kalyani Priyadarshan

ప్రముఖ యాడ్ పిల్మ్ మేకర్ రా కార్తీక్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ చిత్రంలో నటించనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా కథానుగుణంగా ఈ చిత్రానికి ముగ్గురు హీరోయిన్లు కావాలట. అందులో భాగంగా మొదటి హీరోయిన్‌గా హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

కాగా మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయిన కల్యాణి.. హలో చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం అయినప్పటికీ టాలీవుడ్‌లో వరుసగా రెండు ఆఫర్లను సొంతం చేసుకొని బిజీ అయిపోయింది. అయితే తన మాతృ భాష మలయాళంలో మాత్రం ఆమెకు ఇప్పటివరకు ఆఫర్ రాకపోగా.. తాజాగా దుల్కర్ చిత్రానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే బ్రూస్‌లీ ఫేమ్ కృతి కర్బందా ఇందులో రెండో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

సంబంధిత వార్తలు