డబ్బింగ్‌లో కల్యాణ్ దేవ్ చిత్రం

Updated By ManamThu, 05/17/2018 - 19:39
kalyan

kalyanచిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరో కల్యాణ్ దేవ్ డబ్బింగ్ ప్రారంభించారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్ దేవ్‌కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తున్నారు. చిత్ర టైటిల్ మరియు రిలీజ్‌ డేట్‌ను త్వరలో ప్రకటిస్తారు. రాకేష్ శశి ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో కథ అందించిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English Title
kalyan dev film in dubbing
Related News