వంశీచంద్ రెడ్డికి నేతల పరామర్శ

kalwakurthy congress condidate Vamshi Chand Reddy shifted to NIMs

హైదరాబాద్ : తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. కాగా  కాగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లిలో వంశీచంద్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. పోలింగ్‌ బూత్‌ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై దుండగులు దాడి  చేయడంతో వంశీచంద్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. 

ఈ ఘటనలో ఆయన  సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న వంశీచంద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు, కుమార్ రావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు