డాక్టర్ పాత్రలో చంద‌మామ‌

Updated By ManamFri, 08/10/2018 - 17:14
Kajal Aggarwal

Kajal Aggarwal‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ చంద‌మామ  కాజల్ అగర్వాల్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా కూడా కుర్ర హీరోయిన్స్‌కు ధీటుగా పోటీనిస్తూ.. అవకాశాలను అందుకుంటంది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో నటిస్తుంది. అలాగే శర్వానంద్, సుధీర్ కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ సినిమాలో కాజల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు షేడ్స్‌లో కనిపిస్తారు. అందులో 1980-90 కాలానికి చెందిన లుక్ ఒక‌టైతే.. ఇప్పటి కాలంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు శర్వా. ఈ పాత్రను ప్రేమించే డాక్టర్‌గా కాజల్ నటిస్తుందట. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రలో ‘హలో’ బ్యూటీ కల్యాణి ప్రియుదర్శన్ నటిస్తుంది. 

English Title
Kajal Aggarwal in Doctor character..?
Related News