ప్రైవేట్ విద్యాసంస్థలపై ఎలాంటి వ్యతిరేకత లేదు

Updated By ManamWed, 05/16/2018 - 11:08
kadiyam

kadiyam  హైదరాబాద్: ప్రైవేట్ విద్యా సంస్థలపై తమకు ఏ రకమైన వ్యతిరేక భావం లేదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కడియం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యాప్తికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయని కితాబిచ్చారు.

అయితే ఈనెల 12న‌ భూపాలపల్లి జిల్లాలోని వెంక‌టాపురం మండ‌లంలోని రామానుజాపురం గ్రామంలో జిల్లాలో జరిగిన రైతు బంధు కార్యక్రమానికి వెళ్లిన కడియం అక్కడున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి చూసి, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి వస్తే టైర్లలో గాలి తీసేయాలని అన్నారు. దీనిపై తాజాగా స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, వీటిపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయాపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు సమర్థవంతంగా నడపడానికి విద్యా శాఖ మంత్రిగా నా పూర్తి సహకారం ఇస్తానని కడియం పేర్కొన్నారు.

 

English Title
Kadiyam Srihari about his words on Private Institution
Related News