'కాశి'.. తొలి 7 నిమిషాల సినిమా ఇదిగో..

Updated By ManamTue, 05/15/2018 - 19:49
kaasi

kaasi'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ ఆంటోని. ఆ త‌రువాత 'భేతాళుడు', 'య‌మ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన విజ‌య్‌.. అతి త్వ‌ర‌లో 'కాశి'గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అంజ‌లి, సునైనా, అమృత‌, శిల్పా మంజునాథ్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ త‌మిళ అనువాద‌ చిత్రానికి కృతిగ ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ ఆంటోని సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో.. స్నీక్ పీక్ పేరుతో ఈ సినిమాకి సంబంధించిన తొలి 7 నిమిషాల ఫుటేజ్‌ను ఈ రోజు (మంగ‌ళ‌వారం) చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. ఎప్ప‌టిలాగే మ‌రో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రంతో విజ‌య్ సంద‌డి చేయ‌నున్నార‌ని ఈ వీడియో చూస్తుంటే మ‌రోసారి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.  

English Title
'kaasi' sneak peek.. first 7 mins movie
Related News