ఓటు గల్లంతు.. గుత్తా జ్వాల ఫైర్..!  

Telangana election, Jwala Gutta, polling booth, fairness of the election 
  • ఓటరు జాబితాలో పేరు మిస్సింగ్‌.. 

  • ట్విట్టర్‌లో బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల ఆగ్రహం

  • ఎన్నికల పోలింగ్ పారదర్శకతపై అసహనం.. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కాగా.. సెలబ్రెటీలు సైతం అందరితో పాటు క్యూలో నిలబడి తమ ఓటును వినియోగించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కానీ, ఓటరు జాబితాలో తన ఓటు గల్లంతు కావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై జ్వాల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం ఎన్నికల పోలింగ్ బూత్‌కు వెళ్లి చూడగా ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు అయినట్టు ఆమె గుర్తించారు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో గుత్తా జ్వాల వీడియోను కూడా పోస్టు చేశారు. 

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబం నలుగురిలో ముగ్గురి పేర్లు గల్లంతయ్యాయి. రెండు మూడు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నా.. అందులో నాది, మా అమ్మ ఓటు ఉంది. ఈ రోజు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడి ఓటరు జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యం వేసింది. ఎన్నికల పోలింగ్ ఎంత పారదర్శకంగా జరుగుతుందో దీనిబట్టే తెలుస్తోంది. మా నాన్న, సోదరి, నా పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయాం. కానీ, మా అమ్మ మాత్రమే ఓటు వేశారు. 12 ఏళ్లుగా ప్రస్తుత చిరునామాలో మేం ఉంటున్నాం’’ అని ’’ అని జ్వాల అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ ఒంటరిగా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Jwala Gutta: I checked my name online 2-3 weeks ago, my mother's&my names were there, my father's&my sister's were missing. Today we went to cast vote but my name was also missing. I don't understand how's my name missing. I've been living here for 12 yrs. #TelanganaElections pic.twitter.com/mh1cRnTWu1

— ANI (@ANI) December 7, 2018

To all the silly questions!! pic.twitter.com/6bKDwW8Xcv

— Gutta Jwala (@Guttajwala) December 7, 2018

How’s the election fair...when names r mysteriously disappearing from the list!! 😡🤬

— Gutta Jwala (@Guttajwala) December 7, 2018

Surprised to see my name disappear from the voting list after checking online!! #whereismyvote

— Gutta Jwala (@Guttajwala) December 7, 2018

సంబంధిత వార్తలు