పెళ్లికి సిద్ధమైన జస్టిన్ బీబర్

Updated By ManamMon, 07/09/2018 - 11:54
Justin

beiber‘‘బేబి బేబి’’ అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న కెనడియన్ పాప్‌స్టార్ జస్టిస్ బీబర్ పెళ్లికి సిద్ధమయ్యాడు. గత కొంత కాలంగా అమెరికాకు చెందిన సూపర్ మోడల్ హెయి లీ బాల్వ్డిన్‌తో ప్రేమలో ఉన్న జస్టిస్, త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాదువీరిద్దరి నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది.

అయితే ముందు హెలీనానే ప్రేమించిన జస్టిన్.. ఆ తరువాత విబేధాలు రావడంతో ప్రముఖ గాయని సెలీనా గోమేజ్‌తో డేటింగ్ చేశాడు. ఈ ఇద్దరి జంటకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ముద్దుగా వీరిని జెలీనా అని కూడా పిలుచుకునే వారు. అయితే వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో తిరిగి తన మాజీ ప్రేయసి హెలీనా చెంతకు వెళ్లాడు జస్టిన్. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో జస్టిన్, హెయిలీ వివాహం చేసుకోనున్నట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

English Title
Justin Beiber engaged to Model Hailey
Related News