ప్రయాణాలలో కుదుపులు.. డ్రైవర్లకు జోలపాటే!

Updated By ManamMon, 07/09/2018 - 00:08
image

మెల్‌బోర్న్: కుదుపులకు తట్టుకునేలా వాహనాలలో చేసే ప్రత్యేక ఏర్పాట్లు డ్రైవర్లను జోకొడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. సున్నితమైన కుదుపులు డ్రైవర్లను నిద్రకు జోగేలా చేస్తున్నాయని, దాని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఈ సర్వే తేల్చింది. సీట్లో కూర్చున్న కేవలం పదిహేను నిమిషాలలో ఈ కుదుపుల కారణంగా డ్రైవర్ విశ్రాంతి పొందుతున్న అనుభూతి చెందుతాడట..
 

image


ఆపై చక్కగా జోకొట్టిన అనుభూతిని కలిగించే ఈ కుదుపుల కారణంగా నిద్రకు జోగుతారని ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇతరత్రా పనులతో అలసిపోయి స్టీరింగ్ చేతుల్లోకి తీసుకుంటే ఆ డ్రైవర్ పరిస్థితి చెప్పక్కర్లేదని వర్సిటీకి చెందిన స్టీఫెన్ రాబిన్సన్ పేర్కొన్నారు. ప్రయాణాలలో కుదుపులు కారు, ట్రక్కు డ్రైవర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంపై పదిహేను మంది వలంటీర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని కనుగొన్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని రాబిన్సన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Jumps on wheels
Related News