మంచులో.. మైనస్ డిగ్రీల్లో నగ్న జాగింగ్!

Updated By ManamFri, 04/27/2018 - 10:31
Jogging Naked In Minus Degree Temperatured Ice
Jogging Naked In Minus Degree Temperatured Ice

చలికాలం వచ్చిందంటే చాలు.. ఒంటిని వెచ్చని దుస్తులతో మొత్తం కప్పేస్తాం. అలాంటిది మైనస్ డిగ్రీల శీతోష్ణ పరిస్థితులు ఉండే అచ్చం మంచు కొండల్లోకే వెళ్లాలంటే... తీసుకునే జాగ్రత్తలే వేరు కదా. కానీ, ఓ యువతి మాత్రం ఒంటి మీద నూలుపోగు లేకుండా జాగింగ్ చేసేస్తోంది. చేయడమేంటి.. మంచు గడ్డలు కట్టే నదిలో ఈదేస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు పొద్దున్నే లేవగానే నగ్నంగా తయారైపోయి మంచులో పరుగులు పెట్టేస్తోంది. ఆమె పేరు ఇన్నా వ్లాదిమిర్‌స్కాయా.. వయసు 32 ఏళ్లు. దేశం ఉక్రెయిన్. ఆమె వృత్తి మోడలింగ్. సెక్సాలజిస్ట్ కూడా. ఆమె ఇదంతా ఎందుకు చేస్తోంది..? నగ్నంగా మంచులో జాగింగ్ చేస్తే ఏమొస్తుంది..? ఒంటిని గడ్డకట్టించే చల్లటి నది నీటిలో స్నానం చేస్తే లాభమేంటి..? అంటే ఆమె చెప్పే సమాధానం ‘అందం’!

Jogging Naked In Minus Degree Temperatured Ice

మంచులో అలా నగ్నంగా జాగింగ్ చేస్తే శరీరం అందంగా తయారవడం, నిత్య యవ్వనంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని ఈ భామ చెబుతోంది. ఇలా చల్లటి వాతావరణంలో జాగింగ్ చేయడం, చల్లటి నది నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని, ప్రతి అవయవానికి రక్త ప్రసరణ మెండుగా జరగడం వల్ల కొవ్వు కరిగిపోయి చర్మం నిగనిగలాడుతుందని చెబుతోంది. అంతేకాదు, దేహానికి ఆక్సిజన్ సరఫరా పెరిగి కండరాలు, కీల్ల నొప్పుల నుంచి విముక్తి కూడా కలుగుతుందని అంటోందామె. అయితే, మరీ ఎక్కువ సేపు నీళ్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటానని, కాసేపు మైనస్ డిగ్రీల చల్లటి వాతావరణంలో నగ్నంగా గడిపాక వెంటనే తన వెచ్చని కార్లోకి వెళ్లిపోతానని అంటోంది. ఆమె వింత అలవాటు గురించి తెలుసుకున్న షెక్ రిపబ్లిక్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ టెసిన్‌స్కీ ఆమె చేసే సందడిని కెమెరాలో బంధించాడు.

Jogging Naked In Minus Degree Temperatured Ice

 

English Title
Jogging Naked In Minus Degree Temperatured Ice
Related News