జనసేన కవాతులో అపశ్రుతి

Updated By ManamMon, 10/15/2018 - 17:07
Janasena kavathu at dhavaleswaram bridge
Janasena Kavathu

రాజమండ్రి : ధవళేశ్వరం వంతెనపై జనసేన పార్టీ చేపట్టిన జన కవాతులో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు... సభా ప్రాంగణం పక్కన ఉన్న నీటి పారుదల శాఖ పురాతన భవనాన్ని ఎక్కారు. అయితే పురాతన భవనంతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు దానిపైకి ఎక్కడంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

pawan kalyan-janasena kavathu

కాగా జనసేవ కవాతులో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొనటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. దీంతో భద్రతా కారణాలరీత్యా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను సభాస్థలికి కారులోనే వెళ్లాలని పోలీసులు సూచించారు. పవన్ వాహనం దిగి సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో పోలీసులు... కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. కాగా పిచ్చకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కవాతు కొనసాగింది.

English Title
Janasena kavathu: Building Collapse several Injured In dhavaleswaram
Related News