పడవ ప్రమాదంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

Updated By ManamSat, 07/14/2018 - 21:53
Janasena Chief Pawan React On Boat Accident In Polavaram

Janasena Chief Pawan React On Boat Accident In Polavaram

తూర్పు గోదావరి: జిల్లాలోని పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవబోల్తా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పడవ ప్రమాద వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు.

పవన్ మాటల్లోనే.. 
"
30 మందితో వెళుతోన్న నాటు పడవ, నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి లోనైందని, ఇందులో పాఠశాల నుంచి వస్తున్న చిన్నారులున్నారని తెలిసి తీవ్ర వ్యథకు గురయ్యాను. గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి. గల్లంతైనవారు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకొంటున్నాను. కొన్ని నెలల కిందట జరిగిన వాడపల్లి పడవ ప్రమాదం మరువక ముందే గోదావరి నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరం. జీవితాల్ని ఫణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితుల నుంచి లంక గ్రామాల ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సురక్షితమైన, భద్రతా ప్రమాణాలతో కూడిన నదీ ప్రయాణాల్ని అందుబాటులోకి తీసుకురావాలి" అని ట్విట్టర్ లో పవన్ చెప్పుకొచ్చారు.

English Title
Janasena Chief Pawan React On Boat Accident In Polavaram
Related News