'ఎవరూ సీఎం అయినా అభ్యంతరం లేదు'

Updated By ManamFri, 11/09/2018 - 18:37
Janareddy, Congress, Telangana state, KCR, Chandrababu naidu

Janareddy, Congress, Telangana state, KCR, Chandrababu naiduహైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ పార్టీ నుంచి ఎవరూ సీఎం అయినా తనకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమిలో పొత్తులపై పూర్తి స్పష్టత రాలేదన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానా మాట్లాడుతూ.. బీసీలకు గతంలో ఇచ్చినట్టే సీట్లు కేటాయిస్తామని చెప్పారు. పొత్తుల్లో పరస్పర సహకారం అవసరమన్నారు. ఆయా పార్టీలకు కావాల్సిన సీట్లు వాళ్లు అడిగారని, కానీ మాకు కూడా ముఖ్యమైనవి ఉంటాయని జానా చెప్పారు.

మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రేపు (శనివారం) సాయంత్రానికి పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. కేసీఆర్‌తో తమకు పోలిక లేదని జానా చెప్పారు. దేశం కోసం చంద్రబాబు కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారని ఈ సందర్భంగా జానా చెప్పుకొచ్చారు. గతంలోనూ ఆయన అవసరం కోసం కేసీఆర్‌తో చంద్రబాబు కలిసారని జానా గుర్తు చేశారు. కుటుంబంలో ఒకే సీటు ఇవ్వాలనే నిబంధన ఉందని, సందర్భాన్ని బట్టి మారుతుందని జానా చెప్పారు. కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్‌ చేస్తారన్నారు. ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ గొప్పేమీకాదని తెలిపారు. కేసీఆర్‌ అప్పులు చేసి అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. నిర్ణయాలు ఆలస్యమైనా గెలుపు మాత్రం తమదేనని జానారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 

English Title
Janareddy gives clarity on CM post from Congress in telangana 
Related News