ఇస్రో మరో సరికొత్త ప్రయోగం..

Updated By ManamThu, 07/05/2018 - 17:17
ISRO, spaceflights,
  • వ్యోమగాముల రక్షణకు మరో ప్రయోగం

  • క్రూ ఎస్కేప్ సిస్టంను పరీక్షించిన ఇస్రో

ISRO

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాలలో వ్యోమగాముల భద్రత కోసం ఇస్రో మరో సరికొత్త ప్రయోగాన్ని  గురువారం  నిర్వహించింది. అనుకోని ప్రమాదాలు ఎదురైనపుడు రాకెట్‌లోని వ్యోమగాములు తమను తాము రక్షించుకునేందుకు ‘క్రూ ఎస్కేప్ సిస్టం’ను పరీక్షించింది. మానవ సహిత ప్రయోగాలలో ఈ సాంకేతికత అత్యంత కీలకమైందని ఇస్రో వెల్లడించింది. గురువారం నాడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. 

ప్యాడ్ అబార్ట్ టెస్ట్ పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమనౌకలో సిబ్బంది ఉండే భాగాన్ని విడదీసే ప్రక్రియ సాఫీగా జరిగిపోయింది. భవిష్యత్తులో రోదసీలోకి మానవ సహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో యోచిస్తున్న నేపథ్యంలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టం అత్యంత కీలకంగా మారనుంది. ల్యాంచ్ ప్యాడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు.

ప్రయోగ కేంద్రంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పరీక్షలో భాగంగా తొలుత క్రూ ఎస్కేప్ సిస్టం మాడ్యుల్ ప్రయోగానికి ఐదు గంటల కౌంట్ డౌన్ నిర్వహించారు. అనంతరం 12.6 టన్నుల బరువున్న ఈ మాడ్యుల్ గాలిలోకి ఎగిరింది. బంగాళాఖాతం సముద్ర ఉపరితలంపై ఈ మాడ్యూల్ నుంచి ప్యారాచూట్లు వేరుపడి సముద్రంలో పడ్డాయి. మాడ్యుల్ కూడా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సెన్సార్ల ద్వారా రికార్డింగ్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags
English Title
ISRO tests critical new Crew Escape System for spaceflights
Related News