ఇస్రో శాస్త్రవేత్తగా...

Updated By ManamSun, 07/22/2018 - 00:04
madhavan

imageవైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్న మాధవన్ త్వరలోనే మరో విలక్షణమైన పాత్రలో నటించబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఇస్రోలో కీలక బాధ్యతలు నిర్వహించిన శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. అనంత మహదేవన్ దర్శకత్వంలో ఈ బయోపిక్ తెరకెక్కనుంది.

నంబి నారాయణన్ జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలను దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో మాధవన్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరున లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా ప్రారంభం అవుతుందని టాక్. 

English Title
as isro scientist




Related News