ఐదు రకాల ముద్దులు.. ఎన్నో అర్థాలో..!

Updated By ManamFri, 07/06/2018 - 20:45
International Kissing Day, 5 different types of kisses, different meanings
  • నేడు అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం

  • ఐదు రకాల చుంబనాలు.. అర్థాలే వేరయా..! 

International Kissing Day, 5 different types of kisses, different meaningsవెబ్ ప్రత్యేకం: ముద్దు (చుంబనం). ఇది వినగానే ప్రతిఒక్కరిలోనూ సిగ్గు మొగ్గలేస్తుంది. పెదవులపై చిరునవ్వు చిగురిస్తుంది. ప్రేమికులు కావొచ్చు.. భార్యభర్తలు కావొచ్చు.. ఇరువురి మధ్య అనుబంధం బలపడాలంటే ముద్దు చాలు.. ముద్దు.. బంధం అనే పటిష్టమైన వారధికి పునాదిలాంటిదని చెప్పాలి. ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అంత మహిమ ముద్దుకు ఉంది. ఈ రోజు జూన్ (6) అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం. ప్రేమను వ్యక్తపరచడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా ఒకరినొకరి అనుబంధానికి గుర్తుగా 2006 నుంచి అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయని అందరికి తెలుసు. అయితే ఏయే ముద్దు ఎలాంటి అర్థాన్ని, అనుభూతిని ఇస్తుందో తెలుసా? ఒక్కో ముద్దులో ఒక్కో అర్థం ఎలానంటే మాటల్లో చెప్పలేం.. కేవలం అనుభూతి ద్వారా మాత్రమే ముద్దులోని మాధుర్యాన్ని ఆశ్వాదించగలం. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు అందరూ తమకు ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తిపర్చాలంటే స్వీట్ ఆయుధం ముద్దు ఒక్కటే.

45ఏళ్ల లోపువారే అధికం.. 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధర చుంబనం (లిప్ లాక్) ముద్దంటే ఎంతో ఇష్టపడతారు. అలాంటి అధర చుంబనాన్ని వారానికి కనీసం 31సార్లు ఆశ్వాదించేవారిలో ఎక్కువ శాతం 45ఏళ్ల లోపువారేనని ఓ సర్వేలో వెల్లడైంది. సాధారణంగా నిజజీవితంలో వివిధ రకాల భిన్న సంస్కృతుల మనుషులతో కలిసి జీవిస్తుంటాం. వారిలో స్నేహితులు, బోయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, భర్త, భార్య, తల్లిదండ్రులు ఇలా ఎందరో ఇష్టమైన వారు ఉంటారు. వీరిలో అందరికి ఒకేలా ప్రేమను పంచలేరు. ఒక్కొక్కరిని ఒక్కోలా ప్రేమిస్తారు. ప్రేమగా ముద్దులు కురిపించినప్పుడూ కూడా ఒక్కొక్కరిని ఒక్కోలా ముద్దు పెట్టుకుంటారు. స్నేహితుల చెక్కిళ్లపై ముద్దు పెట్టుకుంటే దాన్ని ఫ్రెండ్లీ కిస్ అంటారు. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం రోజున ఒక్కొక్కరూ తమకు ఇష్టమైనవారికి ముద్దులు పెడుతారు. ఇలాంటి చుంబనాలను ప్రయత్నించి చూడాలని ఏ ప్రేమికులకు ఉండదు చెప్పండి.. మచ్చుకు ఐదు రకాలు ముద్దులు, వాటి అర్థాలను ఓసారి లుక్కేయండి.. ప్రేమికులు, దంపతులు ఈ ఐదు రకాల ముద్దులను ఓసారి ప్రయత్నించి అందులోని మాధుర్యాన్ని చవిచూడండి.. 

నుదుటిపై ముద్దు.. 
International Kissing Day, 5 different types of kisses, different meaningsఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఈ ముద్దును పెడుతారు. ఇందులో బహుళ అర్థాలు దాగి ఉన్నాయి. నుదుటిపై ముద్దు పెట్టిన వ్యక్తి ప్రేమను మాత్రమే కాదు.. మీరంటే ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు. వీరిలో స్నేహితులు, తల్లిదండ్రులు, మీ భాగస్వామి ఎవరైనా కావచ్చు. ఎవరికైనా ఈ ముద్దును ఇవ్వొచ్చు. వ్యక్తితో సంబంధం బట్టి అర్థం మారుతుంది. 

చెక్కిళ్లపై చుంబనం...
International Kissing Day, 5 different types of kisses, different meaningsఒకరిపై అమితమైన ప్రేమను తెలియజేసేది చెక్కిళ్లపై ముద్దు. ఇందులోనూ వేర్వేరు అర్థాలు ఉన్నాయి. స్నేహపూర్వకంగా కావొచ్చు.. క్యూట్‌గా ఉన్నవారిని ముద్దాడటం కావొచ్చు.. కొన్ని దేశాల్లో మాత్రం చెంపలపై ఇలా ముద్దాడితే.. శుభాకాంక్షలు (అంటే.. హాలో.. బై)కు సంకేతంగా చెబుతారు. ఈ ముద్దు.. ఇద్దరి స్నేహితుల మధ్య ఉండొచ్చు.. కంపెనీలు, వ్యాపార భాగస్వాములు లేదా తల్లిదండ్రులు, పిల్లల చెంపలపై ముద్దులిస్తారు. 

చేతిపై చుంబనం.. 
International Kissing Day, 5 different types of kisses, different meanings‘‘నేను నీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను’’ అని ఒకరు తనకు ఇష్టమైన వ్యక్తి చేయిపై ఇలా ముద్దుపెట్టే సందర్భంలో ఈ ముద్దును సంకేతంగా చెప్పవచ్చు. ఆ వ్యక్తి అరచేతి వెనుకపైభాగాన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడి తన ఇష్టాన్ని తెలియజేస్తారు. మీ భాగస్వామిగా ఎన్నుకోనే వారిలో స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఇరువురి పరిచయం స్నేహంగా మారి ఆపై ఇలా ఒకరినొకరు సహజీవనం చేయాలని ఆకాంక్షిస్తారు. 

అధర చుంబనం (పెదవులపై ముద్దు)
International Kissing Day, 5 different types of kisses, different meaningsఈ ముద్దులో మాధుర్యాన్ని మాటల్లో కంటే అనుభూతి ద్వారే ఎక్కువ భావప్రాప్తి పొందుతుంటారు. వ్యక్తిగత ప్రేమను తమకు ఇష్టమైన వ్యక్తిపై మాత్రమే వ్యక్తపర్చేందుకు ఇష్టపడతారు. కానీ, ఈ ముద్దు ఇద్దరు వ్యక్తిగత ఇష్టాయుష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ప్రేమికులు ఇలా తమ అధరాలతో ముద్దాడుతూ ఆనందపడుతుంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై అమితమైన ప్రేమను చూపించే సందర్భాల్లో చిన్నారుల లేతనైన పెదాలను ముద్దాడి మురిసిపోతుంటారు. 

ఫ్రెంచ్ ముద్దు...
International Kissing Day, 5 different types of kisses, different meaningsఫ్రెంచ్ కిస్‌.. గాఢమైన ప్రేమకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ ముద్దును ఎక్కువగా దంపతులిద్దరూ కౌగిలిలో గాఢమైన ముద్దుతో నాలుకను జోపిస్తూ చేసే భంగిమ. భాగస్వామి పెదాలకు నాలుకును తాకిస్తూ ముద్దు మాధుర్యాన్ని ఆశ్వాదిస్తుంటారు. రొమాంటిక్, ముద్దుపై మక్కువ ఎక్కువగా ఉన్న ఇద్దరు వ్యక్తులూ ఈ ముద్దును ఆశ్వాదించాలంటే అందుకు ఎంతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ ముద్దులో నాలుక పాత్ర ఎంతో ముఖ్యం. ఇద్దరి భాగస్వాముల మధ్య సాన్నిహిత్యానికి ఫ్రెంచ్ ముద్దు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ముద్దు ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

English Title
International Kissing Day: 5 different types of kisses which represent different meanings
Related News