వడ్డీ రేట్లు యథాతథం

urjit patel

ముంబై: వ్యయాలను తగ్గించే విధంగా ద్రవ్య విధానాన్ని క్రమాంకితంగా నడిపించే వైఖరికి అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించనున్నట్లు బుధవారం ప్రకటించింది. రెపో రేటును 6.5 శాతంగా, రివర్స్ రెపో రేటును 6.25 శాతంగా మార్చకుండా అలానే ఉంచింది. ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లను మార్చకూడదనేది ఏకగ్రీవ నిర్ణయంకాగా, వైఖరిని తటస్థంగా మార్చేందుకు అనుకూలంగా రవీంద్ర హెచ్. ధోలాకియా ఓటు వేసినట్లు చెబుతున్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్.ఆర్.ఏ ప్రభావం 2018 డిసెంబర్ నుంచి పూర్తిగా తొలగిపోతుంది కనుక దానికి తగ్గట్లుగా సర్దుబాటు చేసి చూసినప్పుడు ద్రవ్యోల్బణ గతిపై అంచనా మారకుండా అలానే ఉంది’’ అని బుధవారంనాటి ఎం.పి.సి తీర్మానం పేర్కొంది. ఇటీవల ఆహార ద్రవ్యోల్బణ సంఖ్యలు దిగువ గతిలో ఉండి ఆశ్చర్యపరచినా, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గినా, వాటి పరిణామ క్రమాన్ని నిశితంగా పరిశీలించడం ముఖ్యం. రానున్న డాటాను బట్టి స్వల్పకాలంలో పెరగగల అనిశ్చిత పరిస్థితులను పరిష్కరించుకోవాలని కేంద్ర బ్యాంక్ తెలిపింది. జి.డి.పి వృద్ధి 2018-19లో 7.4 శాతంగా (ద్వితీయార్ధంలో 7.2-7.3 శాతంగా) ఉండగలదని అక్టోబర్ విధాన సమీక్షలో వెల్లడించిన అంశాన్నే ఆర్.బి.ఐ ఈసారి కూడా ప్రకటించింది. జి.డి.పి వృద్ధి 2019-20 మొదటి ఆరు నెలల్లో 7.5 శాతంగా ఉండగలదని అంచనా వేసింది. దాన్ని దిగువ గతికి సవరించవలసివచ్చే రిస్కులు కూడా కొన్ని లేకపోలేదని పేర్కొంది. మూడు రోజులపాటు సమావేశం జరిపే విధానాన్ని 2019 ఫిబ్రవరి 5న మొదలయ్యే ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షకు కూడా కొనసాగించాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. 
 

సంబంధిత వార్తలు