ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే నిర్మాతగా మారాను 

Updated By ManamTue, 06/19/2018 - 06:58
saidharamtej

saidharamtejసాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు ఉప శీర్షిక. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ.కరుణాకరణ్ దర్శకుడు. జూలై 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఆదివారం ఆడియో సక్సెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘వైజాగ్‌లో బాలచందర్‌గారు డైరెక్ట్ చేసిన ‘మరో చరిత్ర’ ఇన్‌స్పిరేషన్‌తో నిర్మాతగా మారి.. నా మొదటి చిత్రం చిరంజీవిగారితో ‘అభిలాష’ చేశాను. అలా నా సినిమాల్లో ‘స్వర్ణకమలం, చాలెంజ్, ముత్యమంత ముద్దు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలను వైజాగ్‌లో చేశాను.  ఇకపై కూడా వైజాగ్‌లో సినిమాలు చేస్తాను. తేజ్ మంచి కుటుంబ కథాచిత్రం.. అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉంటుంది. మా బ్యానర్‌లో జూలై 6న విడుదలవుతున్న ఈ సినిమా డెఫనెట్‌గా హిట్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. చిత్ర దర్శకుడు ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ ‘‘‘తొలిప్రేమ’ చిత్రాన్ని అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో.. అంతే బాగా ఈరోజు నా తమ్ముడు సాయిధరమ్ ‘తేజ్’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ‘‘తేజ్’ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దొరుకుతుంది. హీరో, హీరోయిన్,  డైరెక్టర్, నిర్మాత కె.ఎస్.రామారావుగారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. భవిష్యత్‌లో సినిమాలు చేసే దర్శకులు వైజాగ్‌లో కొంత భాగాన్ని షూట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. గతంలో బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావుగారు ఇక్కడ సినిమాలు చేశారు. ఏపీలో సింగిల్ విండో క్లియెరెన్స్ సిస్టమ్ ప్రపోజల్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను వైజాగ్‌లోనే సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్నాను. నాకు అప్పటి నుండి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. కరుణాకరన్‌గారు లవ్‌స్టోరీస్ తీయడంలో సిద్ధహస్తులు. మా ‘తేజ్’ సినిమాను కూడా చక్కగా తీశారు. యూత్, కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. 

English Title
That inspiration has become a producer
Related News