ఇన్నోవివి ఇంటర్న్‌షిప్ ఆఫర్

Updated By ManamThu, 11/08/2018 - 23:03
Innovivi

Innoviviహైదరాబాద్: పారిశ్రామిక వేత్తలు కావాలనుకునే వారికోసం ‘ఇన్నోవివి’ సంస్థ  ద్వారా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలు ఒక ఇంటర్న్ షిప్ పోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. నెల రోజుల పాటు అమెరికాలో ఇవ్వనున్న ఈ స్కై ప్రోగ్రామ్‌కు అండర్ గ్రాడ్యుయేట్లు, గ్యాడ్యుయేట్లు, అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వారినుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ఇన్నోవి ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇన్నోవివి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి సొంత కంపెనీ ప్రారంభిచాలని వారి కలను సాకారం చేయనున్నాట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదివ్య వడ్లపుడి చెప్పారు. స్కైడెక్ సహాయంతో ఇన్నోవి సంస్థ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలు అందిస్తున్న వినూత్న ప్రోగ్రామ్ అని ఆమె అన్నారు. బర్కిలీ క్యాంపస్‌లో స్కైడెక్ అనేది  స్టార్టప్‌లకు యాక్సిలరేటర్‌గా, ఇంక్యుబేటర్‌గా ఉన్నది. అయితే ఈ ఇంటర్న్ షిప్‌కు ఎంపికైన వారికి సాఫ్ట్‌వేర్ కోడింగ్, డెవలప్‌మెంట్, డాటా ఎనలైటిక్స్, యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా ఔట్‌రీచ్ మార్కెటింగ్ బ్లాక్‌చైన్ డెవలప్‌మొంట్, సీఆర్‌ఎంట్, బీ2బీ వంటి బిజినెస్ రంగాల నుంచి ప్రాజెక్టులు అందుబాలులో ఉంటాయని ఆమె చెప్పారు. కాగా, ఎంపిక చేయబడిన అభ్యర్థులు మెరుగైన అనుభవం నైపుణ్యాల ద్వారా సొంత కంపెనీని ప్రారంభించడం లేదా ఇండియాలోగాని యూఎస్‌ఏలో గాని బర్కిలీ క్యాంపస్ ఎన్విరాన్‌మెంట్‌లో, సలికాన్ వ్యాలీ ఔత్సహికపారిశ్రామికులతో కలసి పని చేయవలసి ఉంటుంది. విద్యా సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉంటారని శ్రీదివ్య చెప్పారు. 2018 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకూ మొదటి బ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ప్స్తుతం వీసా కలిగిన వారిక మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచారు. ఒక ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 2018 నవంబర్ 10ని చివరి తేదీగా ఇన్కోవివి పేర్కొంది.

Tags
English Title
Innovative internship offer
Related News