నులి పురుగులతో పరేషాన్

Updated By ManamFri, 08/10/2018 - 00:21
health
  • ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను బాధిస్తున్నయ్

  • నివారణకు పరిశుభ్రతే మార్గం

  • నేడు నులి పురుగుల నివారణ దినోత్సవం 

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నులి పురుగుల సమస్య ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధ్యయనంలో నిర్ధారించింది. ఈ కారణంగానే ఏటా ఆగస్టు 10న ప్రపంచ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సమస్యను పూర్తిగా నివారించడానికి చర్యలు చేపట్టడంతోపాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాయి. 19 ఏండ్ల లోపున్న పిల్లలందరికీ ఏటా ఆగస్టు, ఫిబ్రవరి నెలల్లో రెండు పర్యాయాలు మందులు పంపిణీ చేస్తున్నారు.

image


వ్యాప్తికి కారణాలు
మురికి కాలువలు, నీళ్లు నిలువ ఉండడం, జంతువుల మలమూత్రం తదితర అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట జీవించే పిల్లల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటోంది. చిన్నారులకు చేతుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అపరిశుభ్ర ప్రదేశంలో ఆడుకోవడం, ఆహారం తీసుకునే ముందు చేతులు మంచిగా కడుక్కోకపోవడం వల్ల నులి పురుగుల వ్యాప్తి పెరుగుతోందని పిల్లల డాక్టర్ దంపూరి రమేశ్ తెలిపారు.  నిలువ ఉన్న ఆహార పదార్థాలు, సరిగ్గా ఉడకని మాంసం, పాచిపోయిన పాల పదార్థాలు భుంజించినప్పుడు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయన్నారు. తీపి, పిండి పదార్థాలు అతిగా తినడం, మలబద్దకం కూడా ఈ వ్యాధికి కారణమని చెప్పారు.

లక్షణాలు-వాటి ప్రభావం
నులి పురుగులు పొట్టలో చేరి ఆపై మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి. దాంతో అవి కదిలినప్పుడు ఆ ప్రదేశంలో దురద పెడుతుంది. గోళ్ల మధ్యలో, ఇతర శరిర భాగాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయి. పురుగుల సంఖ్య ఎక్కువైతేకడుపు నొప్పి, అజీర్ణంతోపాటు వాంతులు అవుతాయి. పురుగులు పెరుగుతున్న కొద్ది రక్తహీనత ఏర్పడుతుంది. దీంతో పిల్లల శారీరక ఎదుగుదల లోపిస్తుంది. కొంతమంది చిన్నారుల్లో కాళ్లు, మొఖం వాపొస్తాయి. మలాన్ని పరీక్షించడం ద్వారా నులి పురుగుల సమస్యను నిర్ధారించవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మలంలో తెల్లని, సిల్వర్ రంగులో చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి. అలా కన్పిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

పరిశుభ్రమైన ఆహారంతో అరికట్టొచ్చు
imageపరిసరాల పరిశుభ్రతతో పాటు గాలి వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా చూసుకో వాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆహారం తీసుకునే ముందు చేతులను పరిశు భ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర ప్రదేశాల్లో నడిచేటప్పుడు పాదరక్షలు ధరించాలి. చేతిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ, గోళ్ల నడుమ మట్టిలేకుండా చూసుకోవాలి. నిలువ ఉంచిన ఆహా రం కంటే ఎప్పటికప్పుడు వండుకుని తినడం మం చిది. మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినాలి. ఆకు కూ రలను వేడి నీటిలో శుభ్రపర్చుకోవాలి. పండ్లు తినే ముందు తప్పనిసరి వాటిని కడుక్కోవాలి. ప్రభుత్వం పంపిణీ చేసే మందులు తప్పనిసరిగా వాడాలి
- డాక్టర్ మహ్మద్ షరీఫ్

English Title
injurious with silvery worms
Related News