ఇండియన్ బ్యాంకు లాభాలు 44శాతం డౌన్ 

Updated By ManamThu, 08/09/2018 - 23:22
indian-bank

indian-bankన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు 2018-19 జూన్ త్రైమాసికంలో నికర లాభం   రూ. 209.31 కోట్లకు తగ్గినట్లు ప్రకటించింది. అది 2017-18 మొదటి త్రైమాసికంలో రూ. 372.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గడించిన లాభాలు 44 శాతం తక్కువ. మొత్తం ఆదాయం 2018-19 క్యూ1లో  రూ. 5,131.97 కోట్లుగా ఇండియన్ బ్యాంకు పేర్కొంది. అది 2017-18 మొదటి త్రైమాసికంలో రూ. 4,788.04 కోట్ల మొత్తం ఆదాయాన్ని గడించింది. బ్యాంకు మొండి బాకీలు గత ఆర్థిక సంవత్సరం కంటే తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. మొండి బాకీలు, అత్యవసరాలకు కేటాయించిన మొత్తం 2018-19 జూన్ త్రైమాసికంలో రూ. 1,029.56 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. ఈ మొత్తం 2017-18 క్యూ1లో రూ. 715.56 కోట్లుగా ఉంది. కేవలం మొండి బాకీలకు ప్రస్తుతం రూ. 456.60 కోట్లు కేటాయించినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం మొండి బాకీలకు రూ. 681.94 కోట్లను బ్యాంకు కేటాయించింది.

English Title
Indian Bank profits down 44%
Related News