ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేటు పెంపు

Updated By ManamMon, 06/11/2018 - 22:23
indian-bank

indian-bankహైదరాబాద్: ఇండియన్ బ్యాంక్ నిర్ణీతకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్, ఏడాదికి పైన, 3 ఏళ్ళకు తక్కువ వ్యవధి కలిగిన కోటి రూపాయలకన్నా తక్కువ దేశీయ/ఎన్.ఆర్.ఇ టర్మ్ డిపాజిట్లైపె వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల పెంపుదలను తీసుకుచ్చింది. కోటి రూపాయల నుంచి రూ. 5 కోట్లను మూడేళ్ళు అంతకు మించిన కాలానికి డిపాజిట్ చేస్తే ఇచ్చే వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ సవరణ తీసుకొచ్చింది. పర్యవసానంగా ఫండ్ల మార్జినల్ కాస్ట్ ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఎగువ గతిన సవరించింది. పెరిగిన వడ్డీ రేట్లు 2018 జూన్ 11 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 

English Title
Indian Bank Deposit rate
Related News