టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్

Updated By ManamThu, 07/12/2018 - 17:10
1st ODI, India, tour of Ireland, England, Nottingham
  • నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డే 

1st ODI, India, tour of Ireland, England, Nottinghamనాటింగ్‌హమ్: మూడు మ్యూచ్‌ల వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగమ్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ‘‘ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. మేం పటిష్టంగా ఉన్నాం. తొలుత బౌలింగ్ చేస్తాం. మునపటి వ్యూహాలనే కొనసాగించాలనుకుంటున్నాం’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే విజయోత్సాహంతో దూకుడు మీదున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై వన్డేలకు తిరుగులేని జట్టుగా ఇంగ్లాండ్‌ టీ20సిరీస్‌ను కోల్పోయినప్పటికీ వన్డేల్లో రాణించి తమ సత్తాను చాటేందుకు తహతహలాడుతోంది.

English Title
India won the toss and elected to field
Related News