నేటి నుంచి ఇండియా, వెస్టిండీస్ సిరీస్    

Updated By ManamSun, 10/21/2018 - 00:47
India West Indies series
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం

టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయంపాలైన కరేబియన్లు వన్డేల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ సిరీస్‌తోనే వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కు తమ బలమేంటో తెలుసుకోవాలని వెస్టిండీస్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు వరల్డ్ కప్‌కు ముందు మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి వన్డే ఆదివారం జరగనుండటం, దసరా సెలవులకు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు
 

image

న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభంకాబోయే టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్‌కు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా సెలవుల్లో చివరి రోజైనా ఆదివారం అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపేందుకు ఇరుజట్లు రసవత్తరైమెన పోరుకు సిద్ధమయ్యాయి. రెండు టెస్టు మ్యాచ్‌లను మూడురోజుల్లోనే ముగించిన టీమిండియా జట్టుకు వన్డేల్లో విండీస్ జట్టును ఎదుర్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ వెస్టిండీస్ జట్టు టెస్టు కంటే వన్డేల్లో చాలా మెరుగే. గత రెండు దశాబ్దాల నుంచి భారత్ గడ్డపై వన్డేల్లో ఒక మ్యాచ్ కూడా నెగ్గని విండీస్ జట్టు ఆదివారం గువహటి లో జరగబోయే తొలి వన్డేలో నెగ్గి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఇప్పటీకే టెస్టు సిరీస్‌లో 2-0తో కరేబియన్ జట్టుని మట్టికరిపించి మంచి ఫామ్‌లో ఉన్న భారత్ జట్టు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటీకే గువహటి చేరుకున్న భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. అంతేకాకుండా ఆసియా కప్ నుంచి విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేశాడు. విండీస్ టె స్టులో అదరగొట్టినా యువ ఆటగాడు రిషబ్‌పంత్ ఈ సారి వన్డే సిరీస్‌లో ప్రత్యక్ష ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటీవరకూ భారత్- వెస్టిండీస్ జట్లు 121 వన్డే మ్యాచ్‌ల్లో తలపడాయి. వీటిలో టీమిండియా 56 గెలవగా, విండీస్ 61 నెగ్గింది. 

రోహిత్ శర్మ: ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పొందిన తర్వాత గతనెల్లో జరిగిన ఆసియాకప్ గెలవడంలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకం. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శర్మ వన్డే ఫార్మాట్‌లో అతను ఎంత విలుైవెనా ఆటగాడో నిరూపించాడు. ఆసియా కప్ విజయంలో కీలకపాత్ర పోషించి, అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. రోహిత్ విండీస్‌తో జరగబోయే మొదటి వన్డేలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.

శిఖర్ ధావన్: విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు కోల్పోయిన ధావన్ తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో తనైదెన శైలిలో ఆడే ధావన్ టీమిండియా జట్టుకు మంచి శుభారంభాన్ని అందించగలడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఖచ్చితైమెన షాట్లతో టీమిండియాకు భారీస్కోర్ అందించగలడు.

విరాట్ కోహ్లీ: భారత పరుగుల యంత్రం, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆసియాకప్‌కు విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ విండీస్‌తో ఆదివారం జరగబోయే మొదటి వన్డేతో పునరాగమనం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ తనైదెన ఆటతీరుతో జట్టుకి  విజయనందించగలిగే సత్తా ఉన్న కోహ్లీ టెస్టు సిరీస్‌లో ఆడిన విధంగానే ఈ మ్యాచ్‌లో కూడా ఆడాలని చూస్తున్నాడు. 

అంబటి రాయుడు:  ఆసియా కప్‌లో నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రాణించిన అంబటి రాయుడు, కోహ్లీ రాకతో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఏడాదిపాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న రాయుడు ఈ వన్డే సిరీస్‌లో రాణించి జట్టులో స్థానం పదిలం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. 

మహేంద్ర సింగ్ ధోనీ: మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఈ మధ్యకాలంలో ధోనీ ఆటతీరులో మునపటి ఫామ్ లేదని విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్‌లో కూడా ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులు తిరగరాసిన ధోనీ బ్యాటింగ్‌లో మునపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. విండీస్‌తో జరగబోయే ఈ వన్డే సిరీస్‌లో ధోనీ మెరుగ్గా రాణిస్తాడని జట్టు యజమాన్యం భావిస్తోంది.

రిషబ్ పంత్: విండీస్‌తో వన్డే సిరీస్‌లో చూడదగ్గ ఆటగాడు రిషబ్ పంత ఒకడు. ఇప్పటీకే టెస్టుల్లో సత్తా చాటిన ఈ యువ వికెట్‌కీపర్ వన్డేలో చోటు దక్కించుకున్నాడు. మొదటి రెండు వన్డేలకు ఎంపికయ్యాడు. ధోనీ ఉండగా పంత్‌ని ఎంపిక చేయడం అంద ర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ విషయమై చీఫ్ సెలక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ పంత్‌ని బ్యాట్స్‌మన్‌గా, బ్యాక్ అప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశాం. టెస్టుల్లో రాణించిన విధంగానే వన్డేలో కూడా ఆడతాడు అని ఆశిస్తున్నా’ అని ఆయన తెలిపారు.

రవీంద్ర జడేజా: సంవత్సరం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడేజా ఆసియాకప్‌తో తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఆసియా కప్‌లో 4 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా రాణించి ఆల్ రౌండర్ ప్రదర్శనను కనబరిచాడు. అంతేకాకుండా విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు.

ఉమేష్ యాదవ్: శార్దుల్ ఠాకూర్ స్థానంలో  వన్డే జట్టుకి ఎంపికైనా పేసర్ ఉమేష్ యాదవ్. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ వన్డే సిరీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచి వన్డే జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతోఉన్నాడు. 

కుల్‌దీప్ యాదవ్: ఈ మణికట్టు స్పిన్నర్ విండీస్ బ్యాట్స్‌వెున్‌ను ఇబ్బంది పెడతాడు అని కెప్టెన్ కోహ్లీ కుల్‌దీప్‌పై పూర్తి నమ్మకం ఉంచాడు. టెస్టు సిరీస్‌లో విండీస్ బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన కుల్‌దీప్ వైట్‌బాల్‌తో కూడా రాణించాలని చూస్తున్నాడు. 

చాహల్: మిడిల్ ఓవర్లలో కుల్‌దీప్‌తోపాటు, చాహల్ కూడా తన వంతు న్యాయం చేయగలడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. చాహల్ టైట్ బౌలింగ్‌తో పాటు బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి వికెట్ తీయగలడు. విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో చాహల్ తనపై జట్టు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు.
పిచ్: గువహటిలో ఆదివారం వేడి, తేమతో కూడిన వాతవరణం ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. ఈ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో టీమిండియా ఇప్పటీవరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అది కూడా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్.

వన్డేల్లో గట్టి పోటీ ఇస్తాం: హోల్డర్
imageరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయి వైట్‌వాష్‌కు గురైన వెస్టిండీస్ జట్టు బలమైన టీమిండియాకు వన్డేల్లోనైనా గట్టి పోటీ ఇవ్వాలని కెప్టెన్ జాసన్ హోల్డర్ భావిస్తున్నాడు. ‘ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న టీమిండియాపై గెలవడం అంత సులువేమీ కాదు. ప్రపంచంలో వన్డేల్లో టీమిండియా ఉత్తమ జట్టుగా కొనసాగుతోంది. కానీ మేము కూడా గట్టి పోటీ ఇస్తాం. మా జట్టులో అంతా యువకులే, కొత్త ముఖాలే. కానీ తమ సత్తా నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం. ఈ మధ్య కాలంలో వన్డేల్లో బెంచ్ మార్క్ స్కోర్‌గా నిలుస్తున్న 300 పరుగులను స్థిరంగా సాధించలేకపోతున్నాం. ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించాం. ఏదిఏమైనా ఆ 300 మార్క్ స్కోరును సాధించాలని కృత నిశ్చయంతో ఉన్నాం’ అని హోల్డర్ చెప్పాడు.

రాహుల్, పాండే బెంచ్‌కు... 
ఆదివారం విండీస్‌తో జరగబోయే మొదటి వన్డేలో రాహుల్, మనీష్ పాండే బెంచ్‌కు పరిమితమయ్యారు. మిడిలార్డర్‌లో అంబటిరాయుడు జట్టుకు న్యాయం చేయగలడని టీమ్ నమ్ముతుంది. 12 మంది సభ్యులతో కూడిన జట్టులో రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌యాదవ్, చాహల్ ఉన్నారు. అంటే టీమిండియా విండీస్‌తో జరగబోయే మొదటి వన్డేలో ముగ్గురూ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో ఉమేష్ యాదవ్, షమీ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు యువ పేసర్ మహ్మాద్ ఖలీల్ మొదటి వన్డేలో ఆడబోతున్నాడు. ఇక వెస్టిండీస్ విషయానికోస్తే కీరన్ పొలార్డ్, డారెన్ బ్రావోలు జట్టుతో కలిశారు. జాసన్ హోల్డర్ నాయకత్వం వహిస్తున్న విండీస్ జట్టులో ఆదివారం జరగబోయే మొదటి వన్డేలో ముగ్గురు కొత్త కుర్రాళ్లు అరంగే ట్రం చేయనున్నారు.
 
తుది జట్టు
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎవ్‌ుఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, మహ్మాద్ షమీ, ఖలీల్ అహ్మద్.

English Title
India West Indies series FROM today
Related News