గెలిచింది టీమిండియా.. ఇంగ్లాండ్ సంబరాలు? 

Updated By ManamThu, 07/05/2018 - 18:14
India vs England, England Cricket Team, Celebrate Despite Losing T20 To India

India vs England, England Cricket Team, Celebrate Despite Losing T20 To Indiaమాంచెస్టర్‌: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో కోహ్లీసేనతో జరిగిన తొలి టీ20మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయంపాలైన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ సంబరాలు చేసుకుంది. ఓడిపోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు  నిరుత్సాహంగా ఉండాల్సిందిబోయి డ్రెస్సింగ్ రూంలో ఇలా చిందులేశారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని పర్యాటక జట్టు భారత్ 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగా, మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకుంటూ కనిపించారు. వీడియోలో ఇంగ్లాండ్ క్రికెటర్లు జే రూట్, జాస్ బట్లర్, మొయిన్ అలీ ఆనందంతో చిందులేశారు.

అసలు కారణం ఇదే..
ఫిపా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల్లో ఇంగ్లాండ్, కొలంబియా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతోంది. డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు తమ మ్యాచ్‌ను పట్టించుకోకుండా ఫిపా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మునిగిపోయారు. అందులోనూ ఇంగ్లాండ్ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి పెనాల్టీ షూటౌట్‌ను గెలివడమే కాకుండా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూంలోని ఈ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
India vs England: England Cricket Team Celebrate Despite Losing T20 To India. Here's Why
Related News