కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన

Updated By ManamThu, 06/14/2018 - 17:26
India Strongly Condemns UN Report On Human Rights Violation In Kashmir
  • ఐరాస నివేదిక.. కొట్టిపారేసిన భారత్.. తప్పుడు కథనాలని వ్యాఖ్య

India Strongly Condemns UN Report On Human Rights Violation In Kashmir న్యూఢిల్లీ: కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కల్లోలం ఎక్కువైపోయిందని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానిపై అంతర్జాతీయ విచారణ అవసరమని నివేదికలో పేర్కొంది. ఆ వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌పై ఓ తప్పుడు నివేదికను సిద్ధం చేశారని విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. దేశ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేలా నివేదికను వండి వార్చిందని పేర్కొంది. ఐక్యారాజ్యసమితి నివేదిక దిగ్ర్భాంతికరమని, ప్రేరేపిత నివేదిక అని కొట్టిపారేసింది. వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండానే ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. జమ్మూకశ్మీర్ మొత్తం దేశంలో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. 

English Title
India Strongly Condemns UN Report On Human Rights Violation In Kashmir
Related News