నియామకాల్లో ఏడవ స్థానంలో భారత్ 

Updated By ManamTue, 06/12/2018 - 22:50
image

imageన్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు ప్రపంచంలో అత్యంత ఆశావహ యాజమాన్యాలలో ఏడవ స్థానంలో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో నియామకాల పథకాలపై అవి 17 శాతం ‘బుల్లిష్’గా ఉన్నాయని ఒక సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య నిర్వహించిన మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వేలో భారతదేశం 5,110 కంపెనీలు పాల్గొన్నాయి. కడచిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీల ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించే జీతభత్యాలు స్థిరంగా ఉంటాయని తేలింది. సిబ్బందిని సమకూర్చి పెట్టడంలో పేరెన్నికగన్న ఈ సంస్థ 44 దేశాలు, ప్రాంతాలలో దాదాపు 60,000 యాజమాన్యాలను ఇంటర్వ్యూ చేసింది. జపాన్, క్రోషియా, హంగరీ, తైవాన్‌ల నుంచి అత్యంత ఆశావాద అంచనాలు, ఇటలీ, పనామా, స్పెయిన్‌ల నుంచి బలహీనమైనవి వచ్చాయని సర్వేలో తేలింది. ఆ సంస్థ సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించింది. భారత్‌లో నియామకాల అవకాశాలు గత త్రైమాసికంతో పోలిస్తే 1 శాతం, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం మెరుగుపడ్డాయని వెల్లడైంది.‘‘ప్రభుత్వం చేపడుతున్న  కొత్త కార్యక్రమాలకి, స్టార్టప్‌ల పట్ల ఇన్వెస్టర్లు కనబరుస్తున్న ఆసక్తి కూడా తోడవడంతో కొన్ని రంగాలలో వృద్ధికి బాటలుపడుతున్నాయి. వేగంగా రూపుదిద్దుకుంటున్న వ్యాపార వాతావరణ గతిశీలత దృష్ట్యా, సంప్రదాయసిద్ధమైన సిబ్బందికి బదులుగా, కాంట్రాక్టుపై సిబ్బందిని తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని మ్యాన్‌పవర్ గ్రూప్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.జి.రావు చెప్పారు. 

రంగాలవారీగా చూస్తే, టోకు, రిటైల్ వర్తకం, సేవల రంగాల్లో ఉద్యోగావకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రెండు రంగాలు కూడా నికరంగా 20 శాతం నియామకాల అవకాశాలను కనబరచాయి. ‘‘భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉన్న సేవలు, భారతదేశంలో ప్రాబల్యం వహిస్తున్న రంగంగా ఉన్నాయి. అవి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఎగుమతులకు గణనీయంగా తోడ్పడుతున్నాయి. ఫలితంగా, భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి’’ అని రావు అన్నారు. రానున్న త్రైమాసికంలో మొత్తం నాలుగు ప్రాంతాల్లోనూ సిబ్బంది సంఖ్య పెరగనుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు అత్యధికంగా 18 శాతం అవకాశాలు కనబరచాయి. దక్షిణాది సమాచార సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా ఉండగా, ఉత్తరాది ప్రతిభావంతుల కేంద్రంగా ఉంది. ‘‘భారతదేశంలో 2018లో ఉద్యోగావకాశాలు కల్పించే ప్రధాన ధోరణులలో భిన్నత్వం, ఆటోవేుటెడ్ రిక్రూట్‌మెంట్, వర్చ్యువల్ రియాలిటీ, కార్యాలయాలకు దూరంగా ఉండి కూడా పనిచేసే అవకాశం వంటివి ఉన్నాయి. సరైన ప్రతిభావంతులను ఆకర్షించడం కోసం మానవ వనరుల (హెచ్.ఆర్) పరిశ్రమ కూడా మార్కెటింగ్ వైఖరి వైపు మొగ్గు చూపుతోంది’’ అని రావు చెప్పారు. 

Tags
English Title
India ranks seventh in recruitment
Related News