నాకౌట్ చేరిన భారత్

Updated By ManamFri, 08/10/2018 - 00:18
Championship team
  • జూనియర్ ఎన్‌బీఏ వరల్డ్ చాంపియన్‌షిప్

india-nbaఓర్లాండో: జూనియర్ ప్రపంచ ఎన్‌బీఏ చాంపియన్‌షిప్‌లో బాలబాలికల జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ బాలికల జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పూల్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు అండర్-14 విభాగంలో సౌత్ అవెురికా జట్టుతో తలపడింది. ఈ పోటీలో భారత్ జట్టు 40-37తో ప్రత్యర్థి జట్టు సౌత్ అవెురికాని మట్టికరిపించి  గెలుపొందింది. పూల్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో సమిష్ఠిగా రాణించింది. మొదటి మూడు రౌండ్‌ల్లో భారత్ జట్టు 12-9, 14-13, 7-6తో సౌత్ అవెురికాని చిత్తు చేసింది. కానీ చివరి పిరీయడ్‌లో 7-9తో వెనకబడింది. భారత్ జట్టులో కార్తీకా 17 పాయింట్లు చేయగా, సౌత్ అవెురికా జట్టులో బాలాట్టి 13 పాయింట్లు చేసింది. ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 49-56తో సాత్ అవెురికా చేతిలో ఘోరపరాజయం పొందింది. అయినప్పటీకి భారత బాలబాలికల జట్లు నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించాయి. 

English Title
India joins Knockout
Related News