కట్టుదిట్టమైన భద్రత

Heavy courageous
  • భారీ బందోబస్తుతో సర్వసన్నద్ధమైన పోలీసులు

  • కట్టడులు.. బైండోవర్లు.. ఆయుధాల స్వాధీనం

  • శాంతియుత పోలింగ్‌కు పూర్తి స్థాయి చర్యలు

హైదరాబాద్: ఎన్నికల నిర్వహణకు పోలీసులు సర్వసన్నద్దమయ్యారు. ప్రశాంతంగా పోలింగ్ జరిపించడానికి అవసరమైన అదనపు బలగాలను పొరుగు రాష్ట్రాల నుండి తెప్పించారు. ఇప్పటికే తమకు కేటాయించిన ప్రాంతాలకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. రాష్ట్ర స్ధాయి పోలీసు అధికారుల నిరంతర పర్యవేక్షణలో పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా ముగిసేందుకు చన్యలు చేపట్టారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలీసులను మోహరింపచేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాను మొహరింపచేశారు. కేంద్ర    ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగాప్రధాన కార్యాల యంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రాలలోనూ, కమిషనరేట్ లలోనూ అన్ని స్థాయిలలోని అధికారులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి నమూనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల సందర్భంగా జరిగే హింసాత్మక ఘటనల వంటి అంశాలపై అవగాహన కల్పించడం, సంక్షోభ నివారణకు సూచనలు ఇవ్వడం జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శాసన సభ ఎన్నికల నిర్వహణకు శాంతి భద్రతల అదనపు డిజిపిని నోడల్ అధికారిగా నియమించారు. పోలింగ్ సందర్భంగా  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ముందస్తు  ప్రణాళిక రూపొందించు కున్నారు. తగినంత సిబ్బందిని సమకూర్చుకోవడానికి, రాష్ట్ర సరిహద్దుల వద్ద పరిస్థితులను సమీక్షించుటకు వివిధ ప్రభుత్వ విభాగాలతో, కేంద్ర సంస్థలతో, సరి హద్దు రాష్ట్రాలలోని సరిహద్దుజిల్లాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపారు.  తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం, రాజకీయంగా సున్నితమైన నియోజక వర్గాల వంటి అంశాలను, పోలీస్ విభాగం అవసరాలను ఏ రోజుకారోజు సమీక్షించుకుంటూ తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి పకడ్బందీ వ్యూహరచనతో క్షేత్ర స్ధాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

 ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరపడానికి అవసరమయిన సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా మోహరిం పచేయడం  జరిగింది.  రాష్ట్రంలో414 ఫ్లయింగ్ స్క్వా డ్లు,  404ఎస్.ఎస్.టిలు,  3,385 సంచార బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. కీలకమైన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలలో, అలాగే ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించే నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుండి సిబ్బందిని, కేంద్ర దళాలను కూడా రంగంలో దింపారు. ప్రధానికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులు , కేంద్ర మంత్రులకు ఎస్.పి.జి, కేంద్ర దళాలు, ఎన్.ఎస్.జి దళాల రక్షణలో ఉన్న ప్రముఖులతోపాటూ, ప్రమాదం ముప్పు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు, బహిరంగ సభల నిర్వహణ, రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏరివేత కార్యకలాపాలు, కవాతుల నిర్వహణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతరాయం కలిగించే అవకాశము ఉందన్న కారణం తో అనుమానితులందరినీ చట్ట ప్రకారం ముందుగా బైండ్-ఓవర్ చేయడంజరిగింది. ఎన్నడూ లేనంతగా 11,862 నాన్-బెయిలబుల్ వారంట్లు అమలుచేయడం జరిగింది,  ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి నాకా బందీ, చెక్ పోస్టుల ఏర్పాటు, నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ విభాగం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నదనడానికి ఎన్నికల నియమా వళి ఉల్లంఘనలపై  ఇప్పటివరకు1501ఎఫ్.ఐ.ఆర్లు నమోదు కావడం.

కేంద్ర ఎన్నికల సంఘం సూచనలమేరకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉద్దేశించిన నగదు, మద్యం, బహు మతి వస్తువుల తరలింపుని నిశితంగా పరిశీలించడం జరిగింది. అత్యవసర పరిస్థితులలో కీలక ప్రదేశాలకు దళాలను మోహరించడానికి అంబులెన్స్,హెలికాప్టర్లను ఎన్నికల ప్రధాన అధికారి సిద్ధంగా ఉంచారు. డిసెంబరు6వ తేదీ వరకు రాష్ట్ర పోలీసు విభాగం రు.93,08,13,425/- నగదును స్వాధీనం చేసుకుంది. దీనిలో అక్టోబరు19న ఆదిలాబాద్ పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను విభాగానికి అప్పచెప్పిన రు.10కోట్లు, నవంబరు7న హైదరాబాద్ పోలీసులు పట్టుకుని న్యాయస్థానానికి అప్పచెప్పిన రు.7,51,10,300లు కూడా ఉంది. రు.2,37,98,117విలువ చేసే53,769.33 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. (మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది నాలుగు లక్షల లీటర్లు). మొత్తం రు.6,78,86,373ల విలువ చేసే146.6గ్రాముల ప్లాటినం, 689గ్రాముల వజ్రాలు, 17.56కిలోల బంగారం, 121.32కిలోల వెండిని,రు.60,05,177ల విలువ చేసే267.68కిలోల గంజాయి తదితర మత్తు పదార్ధాలు, రు.1,68,89,075 ల విలువ చేసే బహుమతులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా17,882సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా90,238మందిని బైండోవర్ చేయడం, 8482లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకోవడం, 11అక్రమ ఆయుధాల స్వాధీనం, 39ఆయుధాల లైసెన్సులనురద్దు చేయడం, 1172ఎన్నికల నియమా వళి ఉల్లంఘనల కేసుల నమోదు, 11862నాన్ బెయిలబుల్ వారంట్లను అమలు చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు