ఐకియా స్టోర్ ప్రారంభించిన కేటీఆర్

Updated By ManamThu, 08/09/2018 - 13:25
ikea-inaugration in hyderabad
  • గ్రాండ్‌గా ఐకియా స్టోర్ ఎంట్రీ...

KTR-IKEA

హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో మరో ప్రముఖ గృహోపకరణాల సంస్థ కొలువుతీరింది. స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల సంస్థ ఐకియ స్టోర్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.  ఇండియాలో మొట్టమొదటి స్టోర్‌‌ను... హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ దగ్గర 4,00,000 చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో దిగ్విజయంగా ఆరంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్, భారత్‌లో స్వీడన్‌ అంబాసిడర్‌ క్లాస్‌ మోలిన్‌, ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌లు తదితరులు పాల్గొన్నారు.  

ఈ స్టోర్‌లో 7,500 రకాల నాణ్యమైన గృహోపకారణాలు సరసమైన ధరలకు లభించనున్నాయి. రూ. 200 ధరతో మొదలయ్యే చిన్న వస్తువుల నుంచి లగ్జరీ గృహోపకరణాల వరకు ఈ స్టోర్‌లో అనేకం అందుబాటులో ఉన్నాయి. ఐకియ స్టోర్ ఏడాది పొడవునా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఐకియ స్టోర్‌లో ఉత్పత్తులతో పాటు గృహాల డిజైన్‌కు సంబంధించి ఆలోచనలు, స్పూర్తిదాయకమైన సలహాలను కూడా ఇవ్వనుంది. అంతేకాకుండా స్టోర్‌లో 1,000 మంది ఒకేసారి కూర్చునే సామ ర్థ్యం గల రెస్టారెంట్‌ను కూడా ఐకియ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ఐకియా రీటైల్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ మాట్లాడుతూ... అందరికి అందుబాటు ధరలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దేశంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 2013 పొందిన ఐకియా ఇప్పటి వరకు రూ. 4,500 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు. రానున్న మూడేళ్లలో దేశంలోని 20 కోట్ల ప్రజలకు చేరుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

English Title
Ikea first store in India opens in Hyderabad
Related News