కష్టేఫలి.. ‘ఐజీ’ కల్పనానాయక్

Updated By ManamSun, 07/22/2018 - 00:27
kalpana

ఇంజినీరింగ్‌లో మాస్టర్ డి గ్రీ పూర్తి చేసి అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదిం చారు. ఆ తర్వాత ఇన్‌ఫో సిస్‌లో మరో imageఅవకాశం ల భించింది. అయినా.. ఆమె కు ఆత్మ సంతృప్తి కలుగ లేదు. చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలన్నదే ఆమె కోరిక. తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన స్ఫూర్తితోనే సివిల్స్‌వైపు అడుగేశా రామె! ‘కష్టేఫలి’ అన్న మాటను నిజంచేస్తూ రెండో ప్రయ త్నంలో ఐపీఎస్ సాధించి పోలీసు ఆఫీసరయ్యారు. శాంతి భద్రతలు నియంత్రించే పోలీసుశాఖలో ఉద్యోగం చేయాలం టే మగవారే జంకుతారు. కానీ, ఆమెలో ఏ బెరుకూ.. భ యం లేవు. సవాళ్లను స్వీకరించే స్వభావం కలిగిన ఆమె సీనియర్ ఐపీఎస్ అధికారి తమిళనాడు రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ‘ఐజీ’ డి. కల్పనానాయక్.

 పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన నాన్న డీటీ నాయక్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఆమె రెండు దశాబ్దాల క్రితం పోలీస్‌శాఖలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) స్థాయికి చేరుకున్న కల్పనా నాయక్ ప్రస్తుతం తమిళనాడులో వ్యవస్థీకృత, ఆర్థిక నేరాలను నియంత్రిస్తూ, తమ బాధ్యత లను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. తనకున్న మేథో శక్తితో, పోలీసుశాఖలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిపుచ్చుకొని నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. జీవితం లో ఏదైనా సాధించాలంటే రెండు రకాల మార్గాలుంటాయి. ఒకటి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడం.. రెండు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. కల్పనానాయక్ మాత్రం ఈ రెండింటిని ఉపయోగించుకొని కెరీర్‌ను సరికొ త్తగా మల్చుకున్నారు. ముఖ్యంగా మగువలు తలుచుకుం టే సాధించలేనిదేమిలేదని, కష్టించి పనిచేసిన వారు తప్ప కుండా ఉన్నత స్థానాల్లో నిలుస్తారని ఆమె నిరూపించారు. 

కల్పనా నాయక్ మే 8, 1974న కర్నూలులో డాక్టర్ ఇందిర, డీటీ నాయక్ దంపతులకు జన్మించారు. తల్లి ప్రముఖ imageవైద్యురాలు కాగా, తండ్రి పోలీసుశాఖలో అడిషి నల్ డీజీ స్థాయిలో పదవి విరమణ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి నప్పుడు తరచూ బదిలీలు కావడంతో ఆమె చదువంతా పలు పట్టణాల్లో కొనసాగింది. కల్పనానాయక్ ప్రాథమిక విద్యాభ్యాసం తిరుపతి, గుంటూరు, విజయవాడలో కొనసా గగా, ఇంటర్మీడియట్‌ను కాకినాడ ప్రభుత్వ మహిళా కళా శాలలో పూర్తిచేశారు. రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో బీటెక్, మద్రాస్ ఐఐటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ‘మాస్టర్ ఇన్ పోలీస్ మేనేజ్‌మెంట్’ పట్టా పుచ్చుకున్నారు. ఆమె ఉన్నత చదువులు పూర్తికాగానే ‘సివిల్స్’పై దృష్టి కేంద్రీకరించి ఆల్ ఇండియా స్థాయిలో 412 ర్యాంక్ పొంది ఐపీఎస్ సాధిం చారు. ఎస్టీ లంబాడీ కమ్యూనిటీలో మొట్టమొదటి ఐపీఎస్ అధికారిగా ఆమె తెలుగురాష్ట్రాల్లో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతూ 2002 మార్చి 31న ఐపీ ఎస్ అధికారి డాక్టర్ మహేందర్ రాథోడ్‌ను వివాహం చేసు కున్నారు. వీరి కుమార్తె ప్రశంస, కుమారుడు అర్ణవ్ ప్రాథ మిక విద్యాభ్యాసం చేస్తున్నారు. 

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమిలో శిక్షణా నంతరం 1998 డిసెంబర్ 26న పోలీస్‌శాఖలో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్పీ)గా కల్పనా నాయక్ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పంజాబ్, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు. పంజాబ్ రాష్ట్రం మొహాలి, ఫిరోజ్‌పూర్ జిల్లా సూపరింటెండెంట్‌గా, సీఎం సెక్యూరిటీ విభాగం ఎస్పీ గా సేవలందించారు. తమిళనాడులో ఫస్ట్ మహిళా బెటాలి యన్ కమాండెంట్‌గా, నాగపట్టణం ఎస్పీగా, తిరునల్వేలి, మధురై డీసీపీగా సమర్థవంతంగా పనిచేశారు. అనంతరం ఐదేళ్లపాటు డిప్యుటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో సేవలు అందించారు. ముఖ్యంగా సీఐడీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సైబర్ క్రైం విభాగాల్లో పని చేసి ప్రభుత్వ ప్రశంసలు పొందారు. 2012 జూన్ 30న డీఐజీగా ప్రమోషన్ పొందిన కల్పనానాయక్ కోస్టల్ సెక్యూ రిటీ విభాగంలో పనిచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ డీజీపీ కేంద్ర కార్యాల యంలో డీఐజీ (పరిపాలన)గా, తెలం గాణ పోలీస్ అకాడమీలో జా యింట్ డైరెక్టర్‌గా విధు లు నిర్వర్తించారు. 2014లో ఐజీగా పదోన్నతి పొంది శాంతి భద్రతల విభాగంలో సమర్థవం తంగా పచేశారు. 2017 సెప్టెంబర్ నుంచి తమిళనాడు రాష్ట్ర ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ఐజీగా సేవలు అందిస్తున్నారు.

ఏఎస్పీ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు ఆమె ఎక్కడ పనిచేసినా, కేసుల విచారణలో అలసత్వం జరగకుండా చర్యలు imageతీసు కున్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించడం ద్వారానే పోలీసుల గౌరవం పెరుగుతుందనే భావనతో పోలీసు స్టేషన్ల పనితీరు మెరుగుపరిచారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంతోపాటు, బాధి తులకు త్వరగా న్యాయం జరిగేలా చూశారు. దళిత, గిరిజనులకు రక్షణ కవచం లాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేశారు. రాజకీయం ముసుగులో ‘రౌడీ యిజం’ చేసే వారికి  చుక్కలు చూపించారు. అక్రమ వ్యాపా రులపై కొరడా ఝుళిపించిన ఆమె మట్కా, సట్టా, గుట్కాతో పాటు, అసాంఘిక కార్యకలా పాలను నియంత్రించారు. కుం భకోణాలు, భూకబ్జాలపై విచా రణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. తుఫాన్లు వచ్చిన సందర్భంలో పునరావాస కార్యక్రమా లను సకాలంలో చేపట్టారు. అంతేగాక, అనేక రకాల కేసులను సమన్వయం, వేగం తో ఛేదించారు. జాతీయ పర్వదిన సందర్భాల్లో సర్వమతాల పరిరక్షణకు కృషిచేశా రు. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ పండుగలతో పాటు, పుష్కరాలు.. గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్య లు తీసుకున్నారు. ముఖ్యంగా అపహరణకు గురైన మిహ ళలు, పసికందులను కిడ్నాపరుల నుంచి రక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజస్థాపన కోసం ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. దీని ద్వారా ప్రజల్లో భయం పోగొట్టి వారి భద్రతకు పూర్తి భరోసా కల్పించారు. ప్రజల్లో చట్టబద్ధమైన జీవితంపట్ల అవగాహన కల్పించిన ఆమె బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆదరణ చూరగొన్నారు. 

అంతేగాక పలు నేరాలు, ఘోరాలకు సంబంధించిన కేసులను సాంకేతిక పరిజ్ఞానం, సొంత నాలెడ్జ్‌తో ఛేదిం చారు. సీసీ కెమెరాల దృశ్యాలు, శాస్త్రీయ పరిశోధనతో పలు కీలక కేసులకు పరిష్కారం కనుగొన్నారు. విధినిర్వహణలో ప్రత్యేక ముద్రవేసుకున్న కల్పనానాయక్ తమ విభాగంలో ‘పేపర్‌లెస్’ విధానానికి శ్రీకారం చుట్టారు. అంతేగాక పిటి షన్ మానిటరింగ్ విధానాన్ని పటిష్టంచేసి సమాజంలో పోలీ సు శాఖ ప్రతిష్టను పెంచారు. అయితే పోలీస్ అధికారులు చిన్నచిన్న కారణాలతో ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో పెట్ట డం సరికాదంటారు. తాత్సారం చేయడం వల్ల కేసులు నీరు గారిపోయి బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉండదం టారామె! ఫిర్యాదుదారుల గౌరవానికి భంగం కలిగిం చొద్దని, విధులు నిర్వహించే పోలీసులు బాధ్యతగా ఉండా లంటారు. రాజ్యాంగ పరిధిలో జీవించి చట్టప్రకారం పనిచే యాలంటారు. చట్టవ్యతిరేక పనులు చేయడం ద్వారా తాత్కాలికమైన సంపాదన లభించినప్పటికీ అది నిలవ దంటారు. అంతేగాక శాశ్వత ఇబ్బందులు కలుగుతా యంటారు కల్పనా నాయక్. పోలీసు సిబ్బంది ఉద్యోగ విర మణ తర్వాత కుటుంబం, పిల్లల భవిష్యత్తుకు పాటు పడుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటారు. కులమతా లకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలంటారామె. పోలీస్‌శాఖలో తాను సక్సెస్ కావడానికి తన తండ్రి డీటీ నాయక్, భర్త సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేందర్ రాథోడ్ ప్రోత్సాహం ఎంతో ఉందం టారు. వీరిద్దరు తనలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి అన్నివిధాల ప్రోత్సహించారంటారామె! రెండు దశాబ్దాలుగా పోలీసుశాఖలో విశిష్ఠ సేవలందిస్తున్న కల్పనా నాయక్ పలు అవార్డులు, రివార్డులు పొందారు.

ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధా న్యత ఇవ్వాలంటారు ఆమె. మారుతున్న కాలానుగుణంగా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. యువత తమకు తాము తక్కువ అంచనా వేసుకోకుండా అన్ని రంగా ల్లో నిష్ణాతులుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలను అందిపు చ్చుకోవాలంటారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలి తాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. కాబట్టి, లక్ష్యా న్ని నిర్దేశించుకొని పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదంటారామె. నిరుద్యోగ యువత దృఢసంకల్పంతో ముందుకు సాగితే అన్ని విజయాలే లభిస్తాయంటారు. సమాజంలో నైతిక, మానవ విలువలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆమె చెబుతారు.

- గడ్డం  కేశవమూర్తి
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు
8008794162

English Title
ig Kalpana Nayak
Related News