హైదరాబాద్ పేరు మార్చేస్తాం..

Updated By ManamFri, 11/09/2018 - 16:35
If bjp win Will Rename Hyderabad As Bhagyanagar, says raja singh
  • బీజేపీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్ ..భాగ్యనగర్‌గా మార్పు

If bjp win Will Rename Hyderabad As Bhagyanagar, says raja singh

హైదరాబాద్ : ప్రస్తుతం ‘పేర్ల మార్పిడి’ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఊర్ల పేర్లు మార్పు జరగగా... ఆ ట్రెండ్‌ను గుజరాత్‌లో కూడా కంటిన్యూ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ సిద్ధం అయ్యారు. తాజాగా తెలంగాణలో కూడా ఆ జాబితాలో చేరబోతుందట. అది కూడా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అంతేకాదండోయ్ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్ పేర్లను కూడా మర్చనున్నట్లు ఆయన సెలవిచ్చారు. 

గత ఎన్నికల్లో గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్‌ను మొదట్లో భాగ్యనగర్‌ అని పిలిచేవారని,  అయితే కులీ కుతుబ్ షాహీల పాలన మొదలయ్యాక భాగ్యనగర్‌ను హైదరాబాద్‌గా మార్చినట్లు తెలిపారు. దేశం కోసం పనిచేసిన త్యాగధనుల పేర్లతో మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేరు మార్పు డిమాండ్ చాలాకాలం నుంచి ఉందని, అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు...ముస్లింల ఓట్ల కోసం వ్యతిరేకిస్తున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.

కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా.. ఫజియాబాద్‌ను ఆయోధ్యగా, మొగల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన విషయం తెలిసిందే. యోగీ చర్యను ఈ సందర్భంగా రాజాసింగ్ సమర్థించారు. మరోవైపు గుజరాత్ సీఎం కూడా అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

English Title
If bjp win Will Rename Hyderabad As Bhagyanagar, says raja singh
Related News