మద్యం బాటిళ్లను రోలర్‌తో తొక్కించారు..

Updated By ManamWed, 07/11/2018 - 18:16
Spiked foreign liquor gang busted in Hyderabad

Spiked foreign liquor gang busted in Hyderabad

రంగారెడ్డి: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ మార్గాల ద్వారా విక్రయిస్తున్న విదేశీ మద్యాన్ని పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకుని పలువుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇలా విదేశీ మద్యం పెద్ద ఎత్తున పట్టుకోవడంలో రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీసులు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అక్రమ మార్గాల ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. 

గత కొంత కాలంగా.. చెన్నై, బెంగుళూరు, సీపోర్టుల నుంచి విదేశీ మద్యాన్ని కొనుగోలు చేసి నగరంలో అధిక దరకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి మాటు వేసి పలువుర్ని పట్టుకున్నారు. కాగా.. స్లగ్లర్ల నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 640 విదేశీ మద్యం బాటిళ్ల స్వాదీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 40 లక్షలు వుంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. సెక్షన్ 46 ప్రకారంగా విదేశీ మద్యంను అధికారుల సమక్షంలో రోడ్డుపై వరుసగా పేర్చి రోడ్డు రోలర్‌‌తో  తొక్కించారు. బహుశా ఇలాంటి ఘటనలు సినిమాలో తప్ప.. రియల్ లైఫ్‌లో చూడటం చాలా అరుదు. ఈ సీన్ చూసిన మందు బాబులకు గుండె పగిలుంటుందేమో..!

English Title
Hyderabad Excise Department Crushing Foreign Wine With Road Roller
Related News