నగరంలో భారీ అగ్నిప్రమాదం

Updated By ManamFri, 11/09/2018 - 19:00
Shaw gouse hotel, Kottaguda, Hyderbad area
  • షా గౌస్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

  • ఐదుగురికి తీవ్రగాయాలు.. మహిళ పరిస్థితి విషమం

Shaw gouse hotel, Kottaguda, Hyderbad areaహైదరాబాద్: నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగూడలో ఉన్న షా గౌస్ హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కస్టమర్లు, హోటల్ సిబ్బందితో కిక్కిరిసి పోయారు. అదే సమయంలో కిచెన్ నుంచి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కిచెన్‌లో ఉన్న మహిళలకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి.

సకాలంలో ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అప్పటికే మరో సిలిండర్ గ్యాస్ లీకు కావడంతో ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అక్కడే ఉన్న మరో నాలుగు సిలిండర్‌లు పక్కకు తొలగించడంతో భారీ ప్రమాదం తప్పింది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హోటల‌లో రక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

English Title
Huge fire accident in Shaw gouse hotel at Kottaguda
Related News